Posted on 2024-07-28 15:12:10
సమాజ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కండి.
గురూజీ పూజ్య శ్రీ రమేష్ బాయ్ ఓజా....
డైలీ భారత్, కరీంనగర్: వ్యాపారవేత్తలు, సంఘ సంస్కర్తలు , మేధావులు సమాజ సేవలో భాగస్వామ్యం కావాలని, గో సేవ మహా పుణ్యకార్యం లాంటిదని గురూజీ శ్రీ రమేష్ బాయ్ ఓజా అన్నారు. గుజరాత్ రాష్ట్రం పోరు బందర్ లోని సందీపిని విద్యానికేతన్ నిర్వాహకులు గురూజీ శ్రీ రమేష్ బాయ్ ఒజా ఆదివారం కరీంనగర్ లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర ప్రముఖులు భగవాన్ దాస్ కార్వా, వేణుగోపాల్ కార్వా ఆధ్వర్యంలో ఆదివారం రోజున ప్రముఖ వ్యాపారవేత్త కేసర్ మల్ కార్వా జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇట్టి వేడుకలకు గురూజీ హాజరయ్యారు. అనంతరం కరీంనగర్ మండలం ఒద్యారం లో గల శ్రీ దాస్ హాను మాన్ గోశాల ను గురూజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం బాగున్నప్పుడే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. సమాజంలో వివిధ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు తగిన భరోసా తోడ్పాటును అందించడానికి సమాజంలో గుర్తింపు కలిగిన వారందరూ ముందుకు రావాలన్నారు. మెరుగైన సమాజ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. తమ ఆధ్వర్యంలో గుజరాత్ లోని పోరుబందర్ లో నిర్వహిస్తున్న విద్యానికేతన్ లో దాదాపు 2000 మంది అమ్మాయిలు ఉచిత విద్యాభ్యాసం చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >