| Daily భారత్
Logo




రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తాం : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-07-10 11:55:04

Share: Share


రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తాం : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

సుమారు రెండు కోట్లతో పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు

9 గ్రామాల రైతాంగానికి ప్రయోజనం

కొందుర్గు మండలం ఆగిర్యాల గ్రామంలో విద్యుత్ పనులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే శంకర్

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: రైతులకు నాణ్యమైన విద్యుత్తును ప్రభుత్వం ద్వారా అందించడమే తమ లక్ష్యం అని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని వారి సమస్యల పరిష్కారానికి సత్వరమే తాను స్పందిస్తానని షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" అన్నారు. సుమారు రెండు కోట్ల రూపాయలతో మండలంలోని తొమ్మిది గ్రామాలలో వ్యవసాయానికి ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసే ప్రక్రియను ఆయన బుధవారం పరిశీలించారు. ప్రొటెక్షన్ డిటి భాస్కర్ రావు తదితర అధికారులతో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు. నాణ్యమైన విద్యుత్తు లభించే విధంగా 9 గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ లభిస్తుందని పేర్కొన్నారు. మండలంలోని పాత ఆగిరాల, కొత్త ఆగిరాల, విశ్వనాథ్ పూర్, తంగేళ్లపల్లి, వెంకిర్యాల, తిరుమల దేవుని పల్లి, లక్ష్మీదేవి పల్లి, ఘటియతాండ, నాగార్జున హచరిస్ లకు నాణ్యమైన విద్యుత్ సౌకర్యం సమకూరుతుందని ఈ సందర్భంగా తెలిపారు. కోటి రూపాయల పైచిలుకు నిధులతో ఈ పనులు చేపట్టినట్టు చెప్పారు. ఇంకా మరో కోటి రూపాయల వరకు పనులు చేపట్టబోతున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. గత వేసవిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఇకపై విద్యుత్ సమస్య తలెత్తకుండా రైతులు అడిగిన సమస్యకు 24 గంటల్లోనే విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు నిధులు మంజూరు చేసి పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా వెంటనే స్పందించినందుకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ కాంట్రాక్టర్ యెన్నం మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు..

Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >