Posted on 2024-07-09 15:55:29
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్
మండల తహసీల్దార్ కు బిజెపి కిసాన్ మోర్చారైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
షాద్ నగర్ లో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీజేపీ నాయకుల విమర్శలు
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడాన్ని బిజెపి కిసాన్ మోర్చా తీవ్రంగా నిరసిస్తున్నదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం భారతీయ జనతా పార్టీ కిసాన్ మండల అధ్యక్షులు రామకృష్ణ యాదవ్ పట్టణ అధ్యక్షులు హరి భూషణ్ పటేల్ తదితరులు ఆధ్వర్యంలో ప్రభుత్వానికి మెమొరండం సమర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డిలు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది యావత్ తెలంగాణలో రైతులను మోసం చేయడమేనని బిజెపి కిసాన్ మోర్చా భావిస్తున్నదని అన్నారు. ప్రధానంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు పై బడినా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఇచ్చిన హామీని నెరవేర్చలేక పోవడం దురదృష్టకరమనీ, మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా కాకుండా సబ్ కమిటీలు అభిప్రాయాల పేరుతో కాలయాపన చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇక రెండు లక్షల రూపాయల వ్యవసాయ రుణ మాఫీ పథకం విషయంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 200 రోజులు గడుస్తున్నా ఈ ప్రభుత్వం ఇంకా రైతులను గందరగోళ పరుస్తూనే ఉందనీ రుణాలు మాఫీ కాని కారణంగా బ్యాంకుల్లో రైతులు అపరాదుల్లా తలవంచుకోవాల్సి వస్తున్నదని, ఇక కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు అందిస్తాం అన్న ఆర్థిక తోడ్పాటు విషయంలో ఈ ప్రభుత్వం ఇంకా నోరు మెదపకపోవడం దుర్మార్గం అన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పంటల బీమా అమలు చేయకుండా రైతులను ఇబ్బందుల పాలు చేసిందని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని గొప్పలు చెప్పిన రాష్ట్ర సర్కారు నేటికీ ఆ దిశగా కార్యాచరణ చేయకపోవడం శోచనీయం అని అన్నారు. బిజెపి కిసాన్ మోర్చా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో రైతులకు విషయంలో ఇచ్చిన అన్ని హామీలను ఇటువంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నదనీ లేనిచో రైతులను సంఘటిత పరిచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఈ ప్రభుత్వాన్ని బిజెపి కిసాన్ మోర్చా హెచ్చరిస్తున్నదన్నారు. ఈ సందర్భంగా బిజెపి నేతలు పలు డిమాండ్స్ తో కూడిన మెమొరండాన్ని తహాసిల్దార్ కార్యాలయంలో సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణాన్ని బేషరతుగా మాఫీ చేయాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోకి కట్టుబడి రైతు భరోసా పేరుతో సాగు చేస్తున్న ప్రతి ఎకరాకు రైతు భరోసా క్రింద ఖరీఫ్ రబీ కలుపుకొని 15 వేల రూపాయల ఆర్థిక తోడుపాటును అందించాలి.
కౌలు రైతులకు సైతం ఎన్నికల సమయంలో ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా సంవత్సరానికి 15000
ఆర్థిక సహకారం అందించాలి.
వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సంవత్సరానికి 12,000 సంవత్సరానికి వెంటనే అమలు చేయాలి. తెలంగాణలో ప్రధానమంత్రి పంటల బీమా యోజనను వెంటనే అమలు చేయాలి.
బిజెపి కిసాన్ మోర్చా మండల శాఖ ప్రభుత్వానికి ఇచ్చిన మెమోరాండంలో తమ డిమాండ్లను వివరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు రామకృష్ణ యాదవ్ పట్టణ అధ్యక్షులు హరి భూషణ్ పటేల్ కాసోజు శివ శ్యాంసుందర్ రుషికేష్ వంశీకృష్ణ అందెల సందీప్ కిరణ్ గౌడ్ ఇస్నాతి శ్రీనివాస్ మల్చలం మురళి చెట్ల వెంకటేష్ బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >