Posted on 2024-07-09 15:51:55
ఫామ్ హౌస్‌లో రెచ్చిపోయిన ఢిల్లీ అమ్మాయిలు..
ముజ్రా పార్టీలపై పోలీసుల దాడులు.
డైలీ భారత్, రంగారెడ్డి: మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. 12మంది యువకులతోపాటు నలుగురు అమ్మాయిలను అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ కోసం నలుగురు అమ్మాయిలను ఢిల్లీ నుంచి తీసుకువచ్చిన విచారణలో నిందితులు వెల్లడించారు. వారంతా ఫామ్ హౌస్‌లో అసభ్యకర రీతిలో ఉండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. పార్టీ పేరుతో అశ్లీలంగా అర్ధనగ్న నృత్యాలు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారు. అనంతరం వారిని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తుపదార్థాల నిర్మూలన, రేవ్ పార్టీలు, వ్యభిచారంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్ని చర్యలు చేపట్టినా తప్పుడు పనులు చేసే వారు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పాఠశాలలు, కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్, ఈ-సిగరెట్స్, గంజాయి వంటివి సరఫరా చేస్తున్న వారిని గుర్తించేందుకు టీ న్యాబ్ సైతం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇక హైదరాబాద్ నగరంలోని పబ్బుల్లోనూ ఇటీవల డ్రగ్స్ తీసుకుని యువత పట్టుపడుతున్నారు. ఇందులో విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ట్ పెద్దఎత్తున ఉంటున్నారు. ప్రభుత్వం మరింత దృష్టిపెట్టి గంజాయి, డ్రగ్స్, రేవ్, ముజ్రా పార్టీలపై ఉక్కుపాదం మోపాలని పలవురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు..
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >