| Daily భారత్
Logo




జూలై 10 కార్మికుల కోర్కెల దినాన్ని పాటించండి

News

Posted on 2024-07-09 07:02:17

Share: Share


జూలై 10 కార్మికుల కోర్కెల దినాన్ని పాటించండి

జిల్లా, మండల పారిశ్రామిక కేంద్రాల్లో జరిగే ధర్నాలను జయప్రదం చేయండి.

డైలీ భారత్, మాసాయిపేట మెదక్ ప్రతినిధి: మాసాయిపేట మండలం కేంద్రంలో  మంగళవారం నాడు ఉదయం మెదక్ జిల్లా సిఐటియు జిల్లా కార్యదర్శి ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. గత పదేళ్ళుగా సాగించిన సంస్కరణలు, ప్రైవేటీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేసేందుకు మళ్ళీ ఉవ్విళ్ళూరుతున్నది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే 4 లేబర్ కోడ్లను అమలు చేస్తామని బిజెపి ప్రభుత్వం ప్రకటించింది. బొగ్గు బ్లాకుల వేలానికి పూనుకున్నది. ఈపిఎఫ్ సకాలంలో చెల్లించని యాజమాన్యాలకు విధించే జరిమానాను భారీగా తగ్గించింది. కార్పొరేట్ - మతోన్మాదులను ప్రసన్నం చేసుకొని వారికి లాభాలు కట్టబెట్టేందుకు నిశ్చయంగా ఉంది. కేంద్ర బిజెపి విధానాలను నివారించి, కార్మిక హక్కులను కాపాడేందుకు దేశవ్యాప్తంగా కార్మిక పోరాటాలను ఉధృతం చేయాలని సిఐటియు అఖిల భారత కమిటీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 2024 జూలై 10న “కార్మికుల కోర్కెల దినం" పాటించాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగా మెదక్ జిల్లాలో జూలై 10న జిల్లా, మండల, పారిశ్రామిక కేంద్రాల్లో జరిగే ధర్నాల్లో కార్మికవర్గమంతా పాల్గొనాలని సిఐటియు రంగారెడ్డి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుందని సిఐటియు జిల్లా కార్యదర్శి మల్లేశం తెలిపారు

ఈ సమావేశంలో పారిశుద్ధ్య కార్మికులు గుడ్డి నర్సింలు, నాగేష్, కిషన్, తదితరులు హాజరైనరు

Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >