Posted on 2024-07-07 19:31:55
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :మహబూబ్ నగర్ జిల్లా కు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనం ఇచ్చే సమాచారాన్ని క్లుప్తంగా అందించాలి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లో జరిగిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమీక్షా సమావేశం లో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ , జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రి కి కావలిసిన నిర్వాహణ కోసం నిధులు ఇవ్వాలని, రెడ్ క్రాస్ మరియు లయిన్స్ క్లబ్ లాంటి సంస్థల సేవలు వినియోగించుకోవాలని, వారు సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని , అలాగే ఆసుపత్రి ముందు ఉన్న స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టిన ఆసుపత్రి కి స్వంత నిధులు కూడా సమకూర్చుకునే అవకాశం ఉంది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాలని మంత్రులను కోరారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా విద్యాశాఖ కు కావలసిన ప్రతి సమాచారం క్లుప్తంగా ముఖ్యమంత్రికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, విద్యకు సంబంధించి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, హాస్టల్స్ , కావాల్సిన కనీస మౌళిక వసతులు, కాలేజ్ భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బోధనా సిబ్బంది తదితర అంశాలపై ఎస్టిమేషన్ సిద్దం చేసి సియంకి అందించాల్సిన అవసరం ఉందని ఆయన మంత్రులకు తెలిపారు..
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రపోజల్స్ ముఖ్యమంత్రి గారి ముందు ఉంచితే తప్పకుండా ముఖ్యమంత్రి ఆమోదం తెలియజేస్తారని, అందుకు కావల్సిన ప్రపోజల్స్ ముఖ్యమంత్రి కి అందించాలని ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మంత్రులను కోరారు. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం జరిగింది అని, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని ప్రతి పాఠశాలను ఇన్ స్పెక్షన్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎంపి మల్లు రవి , జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి , ఎస్పీ శ్రీమతి డి జానకి , ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్ ,పర్నికా రెడ్డి , వాకిటి శ్రీహరి , జి.మధుసుధన్ రెడ్డి , అనిరుధ్ రెడ్డి , రాజేష్ రెడ్డి , అనిరుధ్ రెడ్డి , డాక్టర్ వంశీకృష్ణ , కసిరెడ్డి నారాయణ రెడ్డి , మేఘా రెడ్డి, బండ కృష్ణ మోహన్ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ , మైనారిటీ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ , గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి సరిత , మాజీ శాసన సభ్యులు సంపత్ కుమార్ మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సిపీఎస్ రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు : సిపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ
Posted On 2026-03-10 20:55:00
Readmore >
కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్
Posted On 2026-03-10 20:28:52
Readmore >
సీనియర్ నాయకులు నారెడ్డి మోహన్ రెడ్డి మృతి పట్ల షబ్బీర్ అలీ సంతాపం
Posted On 2026-03-10 18:48:11
Readmore >
ZPHS గాంధారి పాఠశాల లో పదవతరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి
Posted On 2026-03-10 18:22:28
Readmore >