| Daily భారత్
Logo




కూలీల వేషంలో పేకాటరాయులను పట్టుకున్న పోలీసులు : పోలీస్ నయా స్కెచ్

News

Posted on 2024-07-07 10:17:06

Share: Share


కూలీల వేషంలో పేకాటరాయులను పట్టుకున్న పోలీసులు : పోలీస్ నయా స్కెచ్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పేకాటరాయుల్లని పట్టుకునేందుకు కూలీల లాగా వేషాలు మార్చుకొని  వెళ్లిన పోలీసులు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసుల నయా స్కెచ్.

పేకాట ఆడుతున్న వాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని పోలీసులు దిమ్మతిరిగే ప్లాన్ వేశారు.. రైతుల గెటప్ వేసి అక్కడికి చేరుకుని అందరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పేకాట రాయుళ్లు తమ ఆటకు ఇబ్బందుల్లేని.. పోలీసులు, కుటుంబ సభ్యులకు అనుమానం రాని రహస్య ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో పోలీసులు దిమ్మతిరిగే ప్లాన్ వేశారు. ఈ ప్రాంతలో ఎక్కువగా పేకాట ఆడుతున్నారని.. పోలీసులకు సమాచారం అందింది.. అయితే.. పోలీసులు రాగానే పరుగులు తీస్తుండటంతో వారు ఈసారి అదిరిపోయే స్కెచ్ వేశారు.

అయితే.. పేకాట రాయుళ్లను పట్టుకునేందుకు పోలీసులు కూలీల వేషం వేశారు. పోలీసులకు ముస్తాబాద్ మండలంలోని బందనకల్ గ్రామ శివారు ప్రాంతంలో పంటపొలాల మధ్య పేకాటాడుతున్నారనే సమాచారం అందింది.. అయితే, పోలీస్ జీప్ రాగానే పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కూలీలుగా మారి.. పేకాట స్థావరం దగ్గరికి వెళ్లారు.. వ్యవసాయ కూలీలుగా భావించి.. ఈ పేకాట రాయుళ్ళు దర్జాగా పేకాట ఆడుతున్నారు.

కూలీలే కదా అని వారి దగ్గరకు వెళ్లే వరకు పేకాట ఆడుతున్న వారు పెద్దగా పట్టించుకోలేదు.. చివరకు వారు దగ్గరికి వెళ్లి చుట్టూ చేరారు.. అప్పుడు కూడా వాళ్లకు అర్థం కాలేదు.. చివరకు డ్రెస్ చూసి పేకాట రాయుళ్ళు దెబ్బకు హడలెత్తిపోయారు.. అటు పారిపోలేక.. ఇటు ఏం చెప్పాలో అర్థం కాక నీళ్లు నములుతూ కవర్ చేసే ప్రయత్నం చేశారు  పేకాటరాయుళ్లు..

చివరకు పోలీసులు పేకాట ఆడుతున్న ఏడుగురుని అరెస్ట్ చేసి వారి దగ్గరి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులుహెచ్చరించారు.

Image 1

నటుడు విజయ్ దేవరకొండ పై అట్రాసిటీ కేసు నమోదు

Posted On 2025-06-22 12:21:59

Readmore >
Image 1

మృతి చెందిన కుటుంబానికి 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం

Posted On 2025-06-22 12:05:35

Readmore >
Image 1

ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దరి చంపిన మావోయిస్టులు

Posted On 2025-06-22 10:00:49

Readmore >
Image 1

ట్రంప్‌ స్టార్ట్‌ చేశారు.. మేం అంతం చేస్తాం: ఇరాన్‌

Posted On 2025-06-22 09:59:20

Readmore >
Image 1

తీరుమారని బడి బస్సు..

Posted On 2025-06-22 07:46:51

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడి ఆత్మహత్య

Posted On 2025-06-22 07:22:22

Readmore >
Image 1

ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

Posted On 2025-06-22 05:24:12

Readmore >
Image 1

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య

Posted On 2025-06-21 19:33:29

Readmore >
Image 1

ఇకపై అన్నింటికీ ఒకటే ఎమర్జన్సీ నెంబర్.. కొత్త నెంబర్ ఇదే

Posted On 2025-06-21 17:55:32

Readmore >
Image 1

టీజేఎంయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొప్పుల రమేష్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా అధ్యక్షుడు కురుమేల్ల శంకర్

Posted On 2025-06-21 17:19:52

Readmore >