| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హెచ్ఆర్సి సమావేశం ఏర్పాటు విజయవంతం

హెచ్ఆర్సి సమావేశం ఏర్పాటు విజయవంతం

డైలీ భారత్, హైదరాబాద్: శనివారం రోజు ఉదయం 11 గంటలకు IHRPC చందానగర్ ఆఫీసులో ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మన ఐ హెచ్ ఆర్ పి సి రాష్ట్ర అధ్యక్షులు మమ్మద్ అబ్దుల్ రహమాన్ ఫహీం మరియు తెలంగాణ రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ జహీర్ ఇక్బాల్ విచ్చేశారు.

ముఖ్యంగా ఈ సమావేశంలో నూతన సభ్యులకు వారి యొక్క ఐడి కార్డ్స్ మరియు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది .మరియు వారికి వారి యొక్క బాధ్యతలను తెలపడం జరిగింది.

వచ్చే నెల ఆగస్టు లో హైదరాబాదులో జరగనున్న మన

 ఐ హెచ్ఆర్పిసి నేషనల్ కాన్ఫరెన్స్ గురించి సభ్యులతో చర్చించడం జరిగింది .

ఈ సమావేశానికి మెదక్, సంగారెడ్డి , కామారెడ్డి,మరియు రంగారెడ్డి జిల్లా సభ్యులు పాల్గొన్నారు. 

ప్రతి ఒక్క సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. మన రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ అబ్దుల్ రెహమాన్ ఫహిం మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి మహమ్మద్ జహీర్ ఇక్బాల్ సారథ్యంలో మరియు వారి యొక్క మార్గదర్శకంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజలకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేయడం జరిగింది. 

ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బలరామ స్వామి, మరియు పద్మ ప్రియాంక, డాక్టర్ జ్యోతి, సయ్యద్ రియాజ్, రాహీలా మేడం, మస్తాన్ వలి, మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గారు, రత్నం , కుదరత్ అలీ, లాలూ కుమార్ , రషీద్ మొదలగు సభ్యులు ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. 

ఈ సమావేశానికి వచ్చిన సభ్యులందరికీ మన ఐ హెచ్ ఆర్ పి సి తరపున ధన్యవాదములు తెలియజేయడం జరుగుతుంది.

Previous గ్రామాలలో వ్యర్థ పదార్థాలను లపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి : ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Next మాసాయిపేటలోఎమ్మార్పీఎస్ 30 వ జెండా ఆవిర్భావ దినోత్సవం
ADVERTISEMENT