Posted on 2024-07-06 23:53:46
డైలీ భారత్, విజయవాడ:వ్యర్థాలను వినియోగించే ప్రక్రియను శాస్త్రీయంగా నిర్వహించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. వీటిపై అవగాహన కోసం గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన పరిశీలించారు. వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి పునర్వినియోగిస్తే పారిశుద్ధ్య సమస్యను అధిగమించవచ్చన్నారు.
గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు అనుసరించాల్సిన విధానాలు, వాటి నుంచి ఎటువంటి ఉత్పత్తులు సాధించవచ్చన్న అంశాలపై సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో గార్బేజ్ టు గోల్డ్ పేరుతో ఒక ప్రదర్శన నిర్వహించారు. చెట్ల నుంచి రాలే ఆకులను, కొమ్మలను, పొడి చెత్తను ఊడ్చిన తరవాత తగులపెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతోందన్నారు. వాటిని కంపోస్టుగా మారిస్తే ఎరువుగా ఉపయోగ పడుతుందని.. ఈ విషయంలో స్థానిక సంస్థలు తగు చర్యలు చేపట్టాలన్నారు. రీ సైకిల్ కాని వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించకుండా చూడాలని కోరారు. స్థానిక సంస్థలకు వ్యర్థాలు, పారిశుద్ధ్య నిర్వహణ ఒక సవాల్‌గా మారుతోందని.. శాస్త్రీయ దృక్పథంతో ఘన, ద్రవ వ్యర్థాలను నిర్వహించడంపై అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు.
సిపీఎస్ రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు : సిపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ
Posted On 2026-03-10 20:55:00
Readmore >
కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్న నిందితుడి అరెస్ట్
Posted On 2026-03-10 20:28:52
Readmore >
సీనియర్ నాయకులు నారెడ్డి మోహన్ రెడ్డి మృతి పట్ల షబ్బీర్ అలీ సంతాపం
Posted On 2026-03-10 18:48:11
Readmore >
ZPHS గాంధారి పాఠశాల లో పదవతరగతి చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు విజ్ఞప్తి
Posted On 2026-03-10 18:22:28
Readmore >