Posted on 2024-07-03 22:51:51
డైలీ భారత్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ కాటా ఆమ్రపాలి పాలనలో తనదైన శైలీలో దూకుడు పెంచారు. ఇటీవల నగర కమిషనర్‌గా ఛార్జ్ తీసుకున్న ఆమ్రపాలి..
బుధవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాధారణ పౌరురాలిలా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. అనంతరం పారిశుద్ధ్యంపై ప్రజలకు ఆమె అవగాహన కల్పించారు. సిబ్బంది పని తీరు ఎలా ఉందని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆమె సరదాగా కాసేపు ముచ్చటించారు. ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా, డైనమిక్ ఆఫీసర్‌గా పేరుగాంచిన ఆమ్రపాలి మొన్నటి వరకు కేంద్ర సర్వీసుల్లో పని చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆమె డిప్యూటేషన్‌పై మళ్లీ తెలంగాణకు వచ్చారు. రేవంత్ ప్రభుత్వంలో ఆమ్రపాలికి సరైన ప్రాధాన్యత దక్కింది. మొదట ఆమెను హెచ్ఎండీఏ కమిషనర్‌గా నియమించగా.. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ప్రభుత్వం ఆమ్రపాలిని జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమించింది. ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఛార్జ్ తీసుకున్న ఆమ్రపాలి నగర కమిషనర్‌గా తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు.
"కార్మికులు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలి" : సైకాలజిస్ట్ కె. పున్నం చందర్
Posted On 2026-03-13 12:25:43
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం : జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి
Posted On 2026-03-13 08:09:02
Readmore >
హైదరాబాద్‌లో పారిశుధ్య సమస్యలను నివేదించడానికి వాట్సాప్ సౌకర్యం ప్రవేశపెట్టబడింది
Posted On 2026-03-12 21:53:55
Readmore >
శుక్రవారం నాడు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బేబీ కిట్స్ పంపిణీ కార్యక్రమం
Posted On 2026-03-12 21:52:35
Readmore >
కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
Posted On 2026-03-12 18:49:30
Readmore >