Posted on 2024-07-03 22:49:19
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలోని బివై నగర్ కు చెందిన పల్లె యాదగిరి అనే సైజింగ్ కార్మికుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. చేనేత జౌలి శాఖ ఏడి సాగర్ కథనం ప్రకారం… బి వై నగర్ కు చెందిన యాదగిరి 30 ఏళ్ల నుంచి సైజింగ్ లో వార్పరుగా పనిచేస్తున్నాడు.
ప్రతి నెల రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం వస్తుండేది. ఇంట్లో గొడవల కారణంగా భార్య అతని దగ్గర నుంచి వెళ్ళిపోయింది. దీంతో అతను మనస్థాపానికి గురై గత వారం సైజింగ్ లో దొరికే కెమికల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో గొడవల వలన మనస్థాపానికి గురై బుధవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలిందని ఏడి సాగర్ వివరించారు. మృతునికి భార్య మంజుల, ఇద్దరు కుమార్తెలు లహరి, నిహారిక ఉన్నారు. పెద్దకుమార్తెకు వివాహం జరగగా, రెండవ కుమార్తె హైదరాబాదు లో ఉద్యోగం చేస్తున్నట్లు విచారణలో తేలిందని ఆయన వివరించారు. మృతుడు మరణానికి సంబంధించి వృత్తి పరమైన ఇబ్బందులు కారణం కాదు, కుటుంబ కలహాలే కారణం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు ఎడి సాగర్ వివరించారు.
గండుగులపల్లి ఏకలవ్య స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న బిజెపి నాయకులు
Posted On 2026-03-13 13:26:57
Readmore >
జేకే మల్టీకేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ల్యాప్రోస్కోపిక్ సెంటర్ ప్రారంభం
Posted On 2026-03-13 13:16:52
Readmore >
"కార్మికులు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలి" : సైకాలజిస్ట్ కె. పున్నం చందర్
Posted On 2026-03-13 12:25:43
Readmore >