| Daily భారత్
Logo




జేకే మల్టీకేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ల్యాప్రోస్కోపిక్ సెంటర్ ప్రారంభం

News

Posted on 2026-03-13 08:46:52

Share: Share


జేకే మల్టీకేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ల్యాప్రోస్కోపిక్ సెంటర్ ప్రారంభం

ఆధునిక వైద్య సేవలకు మరో అడుగు

జేకే మల్టీకేర్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ కలాం

డైలీ భారత్, హుజూర్ నగర్: హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు సాంకేతిక పద్ధతులతో శస్త్రచికిత్సలు అందించాలనే లక్ష్యంతో స్థానిక జేకే మల్టీకేర్ హాస్పిటల్ నిర్వాహకులు శుక్రవారం హుజూర్ నగర్ మున్సిపల్ చెర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ల్యాప్రోస్కోపిక్ సెంటర్‌ను ప్రారంభించారు. 

ఈ సందర్బంగా చెర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆధునిక వైద్య రంగంలో ల్యాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సలకు పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా ప్రజలకు మెరుగైన ఆధునిక వైద్య సేవలు అందించేందుకు ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం జేకే మల్టీకేర్ హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ కలాం మాట్లాడుతూ ఆధునిక పరికరాలతో కూడిన ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో  గాల్ బ్లాడర్, అపెండిక్స్, హెర్నియా, కడుపు లోని ఇతర అనేక శస్త్రచికిత్సలను సురక్షితంగా నిర్వహించవచ్చని తెలిపారు.

ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో శస్త్రచికిత్స సమయంలో శరీరంపై పెద్ద కోతలు అవసరం లేకుండా కేవలం చిన్న రంధ్రాల ద్వారా కెమెరా మరియు ప్రత్యేక పరికరాల సహాయంతో శస్త్రచికిత్స నిర్వహిస్తారని  కెమెరా ద్వారా లోపలి భాగాలను స్పష్టంగా చూడగలిగే అవకాశం ఉండటంతో శస్త్రచికిత్సను మరింత ఖచ్చితంగా చేయవచ్చని డాక్టర్ కలాం వివరించారు. ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో  శస్త్రచికిత్స చేయడం వల్ల రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉండటంతో పాటు నొప్పి తక్కువగా ఉండటం ఈ విధానానికి ప్రత్యేకతగా పేర్కొన్నారు.


ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు,18వ వార్డు కౌన్సిలర్ జక్కుల మల్లయ్య, 2వ వార్డు కౌన్సిలర్ కోడి జ్యోతి ఉపేందర్, జక్కుల నవీన్, ఖలీల్ అహ్మద్ ఖాన్,జేకే మల్టీకేర్ హాస్పిటల్ ఇంచార్జ్ షేక్ లతీఫ్, లక్ష్మి నారాయణ, షేక్ సైదా, జేసీబీ షఫీ, యం.డీ లతీఫ్, లైటింగ్ జాని, చాంద్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >