Posted on 2024-07-03 14:00:48
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా ప్రతినిథి : ఉరుకుల పరుగుల జీవితం, నిత్యం ఎక్కడో ఓ మారుమూల గ్రామంలో సమావేశాలు. ఇక సెక్రటేరియట్‌కు వెళితే సంబంధిత శాఖపై అధికారులతో సమీక్షలు రాష్ట్ర మంత్రులు క్షణం తీరిక లేకుండా గుడుపుతున్నారు. అయితే, ఆ బాధ్యతల నుంచి కాస్త చిల్ అయ్యేందుకు మంత్రులు దైవ దర్శనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరు అవుతుంటారు. కానీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రూటు మాత్రం సపరేటు. బుధవారం ఉదయం ఆయన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం, నారాయణపురం గ్రామంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో కాస్త చిల్ అయ్యారు. ఏకంగా లుంగీ కట్టి తన వ్యవసాయ క్షేత్రంలో కలియ తిరిగారు. ఈ క్రమంలోనే తన పక్క పొలంలో ఉన్న రైతులతో మాట్లాడి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. మహిళలతోనూ సరదాగా ముచ్చటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఆరా తీశారు. అయితే, అందుకు సంబంధించిన ఫొటోలను మంత్రి స్వయంగా ట్విట్టర్‌లో షేర్ చేయగా ప్రస్తుతం అవి కాస్త నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >
కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు
Posted On 2026-03-13 16:46:49
Readmore >
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-13 16:41:37
Readmore >
అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్
Posted On 2026-03-13 16:39:38
Readmore >