| Daily భారత్
Logo




క్రిమినల్ చట్టాల్లో నూతన అధ్యయనం - ఇకపై ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా ఫిర్యాదుకు అవకాశం

News

Posted on 2024-07-01 11:30:01

Share: Share


క్రిమినల్ చట్టాల్లో నూతన అధ్యయనం - ఇకపై ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా ఫిర్యాదుకు అవకాశం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా ప్రతినిథి: భారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి బీజం పడింది. బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న చట్టాలు కనుమరుగు కానున్నాయి. 

నూతన క్రిమినల్ చట్టాల అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నేరాల బారిన పడ్డ బాధితులు ఇకపై ఏ పోలీసు స్టేషన్ పరిధిలోనైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. 

అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితుల నుంచి ఫిర్యాదు అందితే "జీరో ఎఫ్ఐఆర్" నమోదు చేయాల్సిందే.

బాధితులు ఇకపై ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. జీరో ఎఫ్ఐఆర్  కచ్చితంగా పోలీసులు నమోదు చేయాల్సిందేనని క్రిమినల్ నూతన చట్టాలు చెబుతున్నాయి . నేరం జరిగిన ప్రాంతం తమది కాదంటూ తప్పించుకునే ప్రయత్నాలు ఇకపై కుదరవు. నేటి నుంచి నూతన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అమలులోకి రానున్న నేపథ్యంలో ఏడేళ్లు, ఆపైన జైలు శిక్ష పడే కేసుల్లో ఫోరెన్సిక్ సిబ్బంది సైతం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాలి . కేసుల్లో నిందితులకు శిక్ష పడాలంటే అవే కీలకంగా మారనున్నాయి.

 కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన చట్టాలతో నేరాల బారినపడ్డ బాధితులు ఇకపై ఏ పోలీసు స్టేషన్‌ పరిధిలోనైనా ఫిర్యాదు చేయొచ్చు. నేరం జరిగిన ప్రాంతం తమ పరిధి కాదంటూ ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు పోలీసుస్టేషన్‌ సిబ్బంది నిరాకరించేందుకు వీల్లేదు. అత్యవసర, విపత్కర పరిస్థితుల్లో ఉన్న బాధితుల నుంచి ఫిర్యాదు అందితే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. దానిపై సత్వరమే స్పందించి తగిన చర్యలు చేపట్టాలి. ఆ తర్వాతే ఆ నేరం ఏ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిందో అక్కడికి బదిలీ చేయాలి.


అలాగే బాధితులు నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లకుండానే పోలీసు అధికారిక వెబ్‌సైట్, అధికారిక యాప్‌ సహా ఇతర ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ పద్ధతుల్లోనూ ఫిర్యాదులు చేయొచ్చు. వాటిపై మూడు రోజుల్లోగా ఫిర్యాదుదారు సంతకం తీసుకుని ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేయాలి. ఇప్పటివరకూ అమల్లో ఉన్న క్రిమినల్‌ ప్రొసీజర్‌లో ఈ ప్రావిజెన్స్‌ లేవు. కేవలం కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల మేరకు జీరో ఎఫ్‌ఐఆర్‌లు  నమోదు చేస్తున్నారు.


దేశవ్యాప్తంగా నేటి నుంచి అమల్లోకి రానున్న కొత్త నేర న్యాయ చట్టాల్లో ఈ మేరకు జీరో ఎఫ్ఐఆర్, ఈ-ఎఫ్ఐఆర్ కు చోటు కల్పించారు. ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశమున్న నేరాలకు సంబంధించి దర్యాప్తు అధికారులు నేర ఘటనా స్థలానికి ఫోరెన్సిక్‌ నిపుణులను తప్పనిసరిగా తీసుకెళ్లి వారితో ఆధారాలు సేకరణ చేపట్టాలి. నేర ఘటనాస్థలం, అక్కడున్న పరిస్థితులు, ఆధారాలన్నింటినీ ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలి. దీని కోసం ఇప్పటికే ఏపీలోని ప్రతి పోలీసుస్టేషన్‌కు ట్యాబ్‌లు అందజేశారు. వాటిల్లో రికార్డు చేస్తే అవి నేరుగా ఈ-సాక్ష్య యాప్‌లోకి వెళ్తాయి. భవిష్యత్తులో ఆయా నేరాల్లో నిందితులకు శిక్ష పడేలా చేయటంలో ఈ సాంకేతిక ఆధారాలు కీలకమవుతాయి.

వివరాలు నమోదుకు ప్రతి జిల్లాకు ఒక పోలీసు అధికారి : సెక్షన్‌ 37 ప్రకారం అరెస్టయినవారి పేర్లు, వారి చిరునామాలు, ఏ నేరాభియోగంపై వారు అరెస్టయ్యారనే సమాచార సేకరణ, ఆ రికార్డుల నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు ఒక పోలీసు అధికారిని, ప్రతి పోలీసుస్టేషన్‌లో ఏఎస్సై హోదా కంటే తక్కువ కాని అధికారిని నియమించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో పోలీసు కంట్రోల్‌ రూమ్‌లను నోటిఫై చేశారు. దృశ్యమాధ్యమ  విధానం ద్వారా సాక్షులను విచారించేందుకు వీలుగా జిల్లా, మండల స్థాయిలో హైకోర్టు అనుమతితో నిర్దేశిత ప్రాంతాల్లో ఏర్పాటైన వీడియో కాన్ఫరెన్స్‌ గదులను నోటిఫై చేశారు. నగర పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలను ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్లుగా నియమించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసు అధికారులు, సిబ్బందికి బీఎన్ఎస్ఎస్ చట్టాల్లోని అంశాల ప్రకారం అధికారాలు ఇచ్చారు. ఇప్పటికే వీటన్నింటికీ సంబంధించి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇవన్నీ నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.

Image 1

తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-03-14 22:05:48

Readmore >
Image 1

ఫీజుల కోసం పోరు దీక్ష

Posted On 2026-03-14 21:32:57

Readmore >
Image 1

యువతకు శుభవార్త... కామారెడ్డిలో ఉద్యోగ మేళా...

Posted On 2026-03-14 20:33:11

Readmore >
Image 1

వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య వినతికి కేంద్రం స్పందన

Posted On 2026-03-14 20:28:56

Readmore >
Image 1

ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం

Posted On 2026-03-14 19:39:44

Readmore >
Image 1

జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు

Posted On 2026-03-14 19:33:15

Readmore >
Image 1

మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.

Posted On 2026-03-14 17:37:18

Readmore >
Image 1

రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

Posted On 2026-03-14 14:28:12

Readmore >
Image 1

పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు

Posted On 2026-03-14 13:05:35

Readmore >
Image 1

గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"

Posted On 2026-03-14 11:41:04

Readmore >