డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ లో ని రాజేంద్రనగర్ పివిఆర్ ఎక్స్‌ప్రెస్ వే కారు రేసింగ్ ఆదివారం అర్ధరాత్రి చేసిన యువకులు రూయ్ రూయ్ అంటూ దూసుకొని వచ్చి పల్టీలు కొట్టిన కారు. పిల్లర్ నెంబర్ 296 వద్ద ఢీవైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టిన థార్ కారు. ఐదు, ఆరు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయిన కారు. కారు లో ప్రయాణిస్తున్న గణేష్ అనే యువకుడు మృతి. భారీ గా ట్రాఫిక్ జామ్. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ ను మరలించిన సిబ్బంది. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు.
మితిమీరిన వేగమా? మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసారా? అనే కోణం లో దర్యాప్తు చేస్తున్న కాప్స్.
నుజ్జు నుజ్జు అయిన కారు.