Posted on 2024-06-13 17:23:13
కార్పొరేట్ నారాయణ స్కూల్ పైన క్రిమినల్ కేసులు పెట్టాలి
జిల్లాలో విచ్చలవిడిగా అధిక ఫీజులు డ్రెస్ లు బుక్స్ అమూతున్న విద్యాశాఖ అధికారుల కంటికి కనిపిస్తలేదా కార్పొరేట్ ప్రవేట్ విద్యాసంస్థల తొత్తులుగా అధికారులు
మమ్ముళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు
అధిక ఫీజులు మరియు బుక్స్ డ్రెస్ కు అమూతున్న వారిపైన చర్యలు తీసుకోకుంటే డి ఈ ఓ ఆఫీస్ ముట్టడి చేస్తాం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రములో ఏబీవీపీ ఆందోళనలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా అధిక ఫీజులు పుస్తకాలు డ్రెస్ లు అమ్ముతున్నా కార్పొరేట్ నారాయణ స్కూల్ ని విద్యాశాఖ అధికారితో సీజ్ చేపించడం జరిగింది
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈ కార్యక్రమం లో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ జిల్లా కన్వీనర్ అక్కేం నాగరాజు లు మాట్లాడుతూ
నారాయణ పాఠశాల పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అలాగే పర్మిషన్ రద్దు చేయాలనీ 4గంటలు ఆందోళన చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి మండల విద్యాశాఖ అధికారి స్పందించలేరు కలెక్టర్ దృష్టికి తీసుకుపోయాక సీజ్ చేశారు విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ ప్రవేట్ స్కూల్స్ దగ్గర మమ్ముళ్లు ముడుపులు తీసుకొని మొద్దూనిద్రలో ఉంటున్నారు వీరిపైన విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి జిల్లాలో విచ్చలవిడిగా అధిక ఫీజులు బుక్స్ డ్రెస్ లు అమ్ముతున్న ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు వెంటనే చర్యలు తీసుకోకుంటే డి ఈ ఓ కార్యాలయం ముట్టడిస్తాం అని అన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని నారాయణ విద్యాసంస్థలో బుక్స్ విక్రయిస్తున్నారంటూ ఎబివిపి నాయకులు ఆందోళన చేశారు. పాఠశాలలో తనిఖీలు చేసి పుస్తకాలు ఉన్న గదిని సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు.
ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్న నారాయణ ప్రైవేట్ స్కూల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జిల్లా లో విచ్చలవిడిగా పుస్తకాలను అమ్ముతున్నారు మధ్యతరగతి విద్యార్థులు పుస్తకాలు కోనలేకా ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు అదే విధంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అధిక ధరలకు అమ్ముతున్న ప్రైవేట్ పాఠశాలలు .అంతే కాకుండా ప్రైవేటు పాఠశాలలు ఫీజులు అధికంగా వసూలు చేయడం జరుగుతుంది అలాగే అక్రమంగా పాఠశాలలో నే ఒక గదిలో పెట్టి పుస్తకాలను అమ్ముతూ విద్యార్థుల తల్లదండ్రులు నుండి అధిక ధరలకు అమ్ముతున్న యాజమాన్యం కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలా దందా అధికారుల కంటికి కనిపిస్తలేదా రాజన్న సిరిసిల్ల జిల్లా కార్పొరేట్ నారాయణ స్కూల్ లో బుక్స్ డైరీలు డ్రెస్ లు అమ్ముతున్నారని ప్రైవేట్ స్కూల్ లకీ కొమ్ము కాస్తున్న జిల్లా విద్య అధికారులు మొద్దు నిద్ర లో ఉంటూ కమిషన్ లకు కక్కర్తి పడుతు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న అధికారులను సస్పెండ్ చెయ్యాలి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం పాఠశాలలలో పాఠ్య పుస్తకాలు అమ్మొద్దని చెప్పిన అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి అని డిమాండ్ చేయడం జరిగింది.విద్య సంవత్సరము ప్రారంభం అయినా కూడా ఇప్పటి వరకు విద్య వ్యవస్థను పట్టించు కున్న పాపాన పోలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఫీజు నియంత్రణ చట్టం తీసుకరావాలి పెద బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రి నీ నియమించకపోవడం చాలా దురదృష్టం అని అన్నారు . ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యల మీద దృష్టి పెట్టీ వారి సమస్యలు పరిష్కరించాలని అంతే కాకుండా అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాల ల మీద మరియు అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థల మీద చర్యలు తీసుకోవాలని అలాంటి విద్య సంస్థల వాటి అనుమతులు రద్దు చేయాలి అని పెద బలహీన వర్గాల విద్యార్థులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వంని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారావేణి రంజిత్ కుమార్ జిల్లా కన్వీనర్ అక్కేం నాగరాజు ఏబీవీపీ వింగ్ sfd. జిల్లా కన్వీనర్ లోపెల్లి రాజు. అన్నాల్ దాస్ పవన్ కుమార్. ఏనాగాందుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్‌లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >