| Daily భారత్
Logo




ప్రభుత్వ పాఠశాలలో చదువులు ఉత్తమమైనది : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-06-12 18:03:54

Share: Share


ప్రభుత్వ పాఠశాలలో చదువులు ఉత్తమమైనది : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ప్రైవేటు పాఠశాలల్లో చదివించి అప్పులపాలు కావోద్దు

చౌదర్ గూడా మండల పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ మరియు పుస్తకాల పంపిణీ చేసిన  ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : అప్పులు తెచ్చి ప్రైవేటు పాఠశాలలో పిల్లలను చదివించడం కన్నా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమమైన చదువులు తల్లిదండ్రులు అందించవచ్చని మంచి నాణ్యమైన చదువులకు ప్రభుత్వం గ్యారెంటీ అని స్థానిక ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" అన్నారు. నియోజక వర్గంలోని చౌదర్ గూడ మండల పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ మరియు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన చదువు అందిస్తున్నామని ప్రైవేటు పాఠశాలల కన్నా ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్య లభిస్తుందని అన్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులను ఖర్చుపెట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని పేద విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్స్ పాఠ్యపుస్తకాలు కూడా అందజేస్తున్నామని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట పేరిట  పున ప్రారంభించడం గొప్ప విషయం అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే శంకర్ వివరించారు.

ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్వో మండల ఎంపీడీవో మండల ఎంఈఓ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..

Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >
Image 1

స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె

Posted On 2026-03-04 21:01:53

Readmore >
Image 1

మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

Posted On 2026-03-04 20:00:46

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయ నాలుగవ వార్షికోత్సవం

Posted On 2026-03-04 19:28:49

Readmore >
Image 1

కన్నకొడుకు గెంటేశాడు.. జిల్లా కలెక్టర్ కొడుకులా కాపాడారు..

Posted On 2026-03-04 18:36:56

Readmore >
Image 1

మస్జీద్ కాంప్లెక్స్‌లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-03-04 18:30:50

Readmore >
Image 1

కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు

Posted On 2026-03-04 16:19:10

Readmore >
Image 1

38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్

Posted On 2026-03-04 16:16:19

Readmore >
Image 1

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

Posted On 2026-03-04 15:50:03

Readmore >
Image 1

భాగ్యనగరంలో జోరుగా నకిలీ సరుకుల దందా

Posted On 2026-03-04 14:17:30

Readmore >