| Daily భారత్
Logo




కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 41 మంది దుర్మరణం

News

Posted on 2024-06-12 17:29:02

Share: Share


కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 41 మంది దుర్మరణం

డైలీ భారత్, కువైట్: కువైట్‌లోని మంగాఫ్ ప్రాంతంలో ఓ భవనంలోని కిచెన్‌లో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని కొందరు మృతిచెందగా.. మరి కొందరు భయపడి భవనంపై నుండి దూకి మృతిచెందారు.

ఈ ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. వీరిలో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం.

కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఎత్తైన భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు భారతీయులతో సహా 41 మంది సజీవదహనమయ్యారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

కువైట్‌లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 41 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని కువైట్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో భవనంలో మంటలు వ్యాపించాయి. మంటలు అంటుకుని భవనం అంతా వేగంగా వ్యాపించాయి. దీంతో చాలా మంది లోపలే చిక్కుకున్నారు. ఈ భవనంలో ఎక్కువగా కార్మికులు నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో 41 మంది మృతి చెందారని.. మరో 43 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కువైట్ డిప్యూటీ ప్రధాని వెల్లడించారు.

మృతుల్లో ఐదుగురు కేరళకు చెందిన వారు ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక భారత రాయబార కార్యాలయం నుంచి కేంద్రమంత్రి సమాచారం సేకరిస్తున్నారు. మృతుల కుటుంబాలకు జై శంకర్ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని.. సహాయ అందిస్తామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. "కువైట్ నగరంలో అగ్నిప్రమాద ఘటన వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. 40 మందికి పైగా మరణించారని మరియు 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారని తెలిసింది. తదుపరి సమాచారం కోసం మేము ఎదురుచూస్తున్నాం.' అని జైశంకర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Image 1

అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు

Posted On 2026-03-05 06:04:46

Readmore >
Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >
Image 1

స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె

Posted On 2026-03-04 21:01:53

Readmore >
Image 1

మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

Posted On 2026-03-04 20:00:46

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయ నాలుగవ వార్షికోత్సవం

Posted On 2026-03-04 19:28:49

Readmore >
Image 1

కన్నకొడుకు గెంటేశాడు.. జిల్లా కలెక్టర్ కొడుకులా కాపాడారు..

Posted On 2026-03-04 18:36:56

Readmore >
Image 1

మస్జీద్ కాంప్లెక్స్‌లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-03-04 18:30:50

Readmore >
Image 1

కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు

Posted On 2026-03-04 16:19:10

Readmore >
Image 1

38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్

Posted On 2026-03-04 16:16:19

Readmore >
Image 1

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

Posted On 2026-03-04 15:50:03

Readmore >