Posted on 2024-06-12 15:44:46
ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంతో విద్యకు ప్రాముఖ్యత ఇవ్వలేదని విమర్శలు
చారిత్రాత్మక మొగిలిగిద్ద పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం
హాజరైన జిల్లా కలెక్టర్ శశాంక, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి తదితరులు
బడిబాట కార్యక్రమంలో ఏకరూప దుస్తులు పుస్తకాలు పంపిణీ
ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నామంటూ ఎమ్మెల్యే శంకర్, జిల్లా కలెక్టర్ శశాంకల స్పష్టికరణ
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక చిన్నాభిన్నంతో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, విద్యాభివృద్ధిని విధ్వంసం చేసిందంటూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" విమర్శించారు. నియోజక వర్గంలోని ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలోని 150 ఏళ్ల చారిత్రాత్మక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన బడిబాట కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితా రెడ్డి, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీలత, డిఈవో సుశేందర్ రావు, స్థానిక జడ్పిటిసి పి. వెంకట్రాంరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బడిబాట కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేయడంతో విద్యకు ప్రాముఖ్యత ఇవ్వలేదని దీంతో విద్యాపరంగా మౌలిక సదుపాయాలు సన్నగిల్లడం ఆర్థిక అంశాల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలని మొదటి క్యాబినెట్ సమావేశంలోనే తీర్మానం చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో ప్రొఫెసర్ హరగోపాల్, గవర్నర్ సత్యనారాయణ లాంటి వారు ఇక్కడ చదువుకున్నారని గుర్తు చేసుకున్నారు. గతంలో గ్రామాల నుండి విద్యార్థులు ఐదారు కిలోమీటర్లు నడుచుకుంటూ పాఠశాలలకు వచ్చి చదువుకునేవారని ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిందని విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో అన్ని సదుపాయాలు రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇంతటి వాడినయ్యానని ఎమ్మెల్యే శంకర్ గర్వంగా చెప్పారు.
పాఠశాల అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. ఈ గ్రామం ఎంతో చరిత్ర ఉన్న నేపథ్యం ఉండడంతో ఇక్కడ ప్రభుత్వ కళాశాలకు కూడా తనవంతు సాయం చేయడం జరిగిందని గుర్తు చేశారు.
విద్యా ప్రమాణాలతోనే బంగారు భవిష్యత్తు - జిల్లా కలెక్టర్ శశాంక
విద్య ప్రమాణాలతోనే బంగారు భవిష్యత్తు పిల్లలకు లభిస్తుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక బడిబాట కార్యక్రమంలో వివరించారు.
మొగిలిగిద్ద పాఠశాలలొ బడిబాట కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. తాను కూడా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలోని చదువుకున్నానని పాత రోజులు గుర్తు చేసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్య ప్రమాణాలు ప్రైవేటులో కూడా ఉండవని పేర్కొన్నారు. మంచి అధ్యాపకులు, ఉత్తమ బోధన రెండు లభిస్తాయని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో 50 మంది పదికి పది శాతం మార్కులు సంపాదించారంటే ఎంతో గొప్పగా ప్రభుత్వ విద్య ప్రమాణాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా 25 పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత రావడం కూడా గొప్ప విషయం అని కలెక్టర్ చెప్పారు. విద్య కోసం తల్లిదండ్రులు పూర్తిస్థాయిలో సహకరించాలని ఒక ఉపాధ్యాయుల పైన భారం పెడితే సరిపోదని తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వారు ఇక్కడ చదివారంటే ఈ పాఠశాలకు ఎంతో గొప్ప గుర్తింపు ఉందని ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందని కలెక్టర్ అభినందించారు. గ్రామ పెద్దలు యువకులు అన్ని వర్గాల వారు విద్యాభివృద్ధికి గ్రామాల్లో సహకరించాలని కలెక్టర్ సూచించారు.
ఆడపిల్లలకు చదువును ఆపొద్దు - జెడ్పి చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి
పదవ తరగతి చదివాక ఆడపిల్లలకు చదువులు ఎందుకని వివాహానికి తొందర పెడుతుంటారని దయచేసి తల్లిదండ్రులు అలాంటి నిర్ణయాలు వెంటనే మార్చుకోవాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనిత రెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు హితవు పలికారు. పదవ తరగతి అయిపోగానే, పై చదువులు ఎందుకని? చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లలకు విద్యను దూరం చేస్తున్నారని వివాహాల పేరిట వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ తీగల అనిత రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఇకపై అలాంటి తల్లిదండ్రులు వారి నిర్ణయాలు మార్చుకుని పిల్లలకు మంచి చదువులు చెప్పించాలని సూచించారు. సమాజంలో ఆడపిల్ల చదువుకున్నప్పుడే ఒక కుటుంబాన్ని ఆ తర్వాత గ్రామాన్ని ఆ తర్వాత ప్రాంతాన్ని శ్రద్ధగా అభివృద్ధి చేస్తుందని మహిళల వల్లే ఆర్థిక స్వాలంబన, సమాజ శ్రేయస్సు ఉంటుందని అనితారెడ్డి చెప్పారు. ఈ పాఠశాలకు తన వంతు సహకారం అందిస్తానని ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సభలో హామీ ఇచ్చారు. జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలపై పూర్తిస్థాయిలో శ్రద్ధ వహించాలని కోరారు. బడికి పంపించగానే వారి బాధ్యత అయిపోదని పిల్లల మంచి చెడులు చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని అప్పుడే విద్యలో సత్ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. అదేవిధంగా బడి మానేసిన విద్యార్థులు మళ్లీ చదవడానికి వచ్చినందుకు వారిని కూడా అభినందించారు. పాఠశాల ప్రారంభోత్సవం రోజునే ప్రభుత్వం ఒక జత దుస్తులు, పాఠ్య పుస్తకాలు ఇవ్వడం గొప్ప విషయం అని గ్రామస్తులు ప్రభుత్వాన్ని అభినందించారు. గ్రామానికి చెందిన సమాజ సేవకుడు ప్రొఫెసర్ హరగోపాల్ సోదరుడు శ్యాంసుందర్ పాఠశాలలో స్వీపర్ సౌకర్యం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ను సభ ద్వారా వేడుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్త గౌరీ శంకర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి, డిఆర్డిఏ పిడి శ్రీలత, ఐసిడిఎస్ అధికారిని నాగలక్ష్మి, సూపర్వైజర్ విజయలక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గండ్రతి బాలరాజ్ గౌడ్, చెంది తిరుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, గ్రామ నాయకుడు శ్యాంసుందర్, మహ్మద్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు..
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్‌లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >