| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు

డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దశాబ్ధి  సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం

ఇందులో భాగంగా జూన్ 1, జూన్ 2, జూన్ 3 తేదీల్లో మూడు రోజులపాటు బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుగనున్నాయి.

జూన్ 1 : 

గన్ పార్క్ అమరవీరుల స్థూపం నుండి ట్యాంక్ బండ్ వద్దగల అమర జ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు.

జూన్ 2 : 

దశాబ్ది ముగింపు వేడుకల సభ తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది. 

ఇదే రోజు హైదరాబాద్లో పలు దవాఖానాల్లో , అనాథ శరణాలయాల్లో, పార్టీ ఆధ్వర్యంలో పండ్లు స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

జూన్ 3: 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ..తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ముగింపు వేడుకలు.. ఆయా జిల్లాల్లోని దవాఖానల్లో అనాథాశరణాలయాల్లో స్వీట్లు పండ్లు పంపిణీ చేస్తారు

Previous ఆర్థిక సాయం అందించిన నాయకులు
Next సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత
ADVERTISEMENT