డైలీ భారత్, రాజంపేట: అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న బీటెక్ విద్యార్థి రేణుక మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. మృతి చెందిన విద్యార్థిని రేణుక తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం. వాండ్రాసి పెంచలయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వారి కుటుంబ సభ్యులకు యాజమాన్యం పైనే పలు అనుమానాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి బాధితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు నేను పక్షంలో అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.
News