Posted on 2024-04-16 14:03:48
డైలీ భారత్, న్యూ ఢిల్లీ : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం హోం శాఖ ఆఫీస్‌లో మంటలు చెలరేగినట్లు సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే కార్యాలయంలోని కంప్యూ టర్లు, పత్రాలు, ఫైళ్లు, జిరా క్స్ మిషన్‌కు మంటలు అంటుకుని కాలి బూడిదై నట్లు గుర్తించారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్కడ లేరని అధికారులు వెల్లడించారు. కొందరు సీనియర్ అధికారులు ఉన్నట్లు తెలిపారు.
మంగళవారం ఉదయం 9.20 గంటలకు ఆఫీస్‌లో అగ్నిప్రమాదం సంభవించి నట్లు వివరించారు. నార్త్ బ్లాక్‌లోని ఐసీ డివిజన్‌లోని రెండో ఫ్లోర్‌లో ఈ మంటలు చెలరేగినట్లు పేర్కొన్నారు.
అమిత్ షా ఆఫీస్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని అధికారులు ఇచ్చిన సమాచారంతో వెంటనే అగ్నిమాపక శాఖ అధికారు లు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు.
7 ఫైర్ ఇంజన్ల సాయంతో ఎగిసి పడిన మంటలను అదుపు చేసినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనలో జిరాక్స్ మెషిన్, కొన్ని కంప్యూటర్లు, మరి కొన్న పత్రాలు అగ్నికి ఆహుతైనట్లు తెలిపారు.
ప్రమాద సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భవనంలో లేరని.. పలు వురు సీనియర్ అధికారులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చు కున్నారు..
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >