డైలీ భారత్, కరీంనగర్ జిల్లా: స్కూల్ బస్సు ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.
మద్దుట్ల గ్రామానికి చెందిన ఎండి ఆలిఫా అనే రెండేళ్ల చిన్నారి సోదరుడు పాఠశా లకు వెళ్తూ స్కూల్ బస్సులో కూర్చుకున్నాడు.
తన సోదరునితో వెళ్లాలని ఆ చిన్నారి బస్సు ముందుకు వెళ్లింది. ఇది గమనించని డ్రైవర్ స్కూల్ బస్సు ముందుకు పోనించాడు. ఆలిఫా తలపై టైరు ఎక్కడంతో తలకు తీవ్ర గాయమై మరణించింది.