Posted on 2024-04-15 05:39:50
డైలీ భారత్, ఉత్తరప్రదేశ్: కారు, ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ సికార్ జిల్లా ఫతేపూర్ షెకావతి లోని ఓ వంతెనపై ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది.
కారులో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు సహా ఏడుగురు ఉన్నారు. సమా చారం మేరకు.. వంతెనపై ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం కారులో మంటలు చెలరేగాయి.
మంటలు చెలరేగడంతో కొద్దిసేపటికే కారులో మంటలు చెలరేగడంతో కారులో ఉన్న వ్యక్తులు బయటకు వచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది.డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాంప్రతాప్ బిష్ణోయ్ మాట్లాడుతూ కారులో ఉన్న వారందరూ ఉత్తరప్రదేశ్ లోని మీరట్‌కు చెందిన వారని తెలిపారు.
సలాసర్ బాలాజీ టెంపుల్ నుంచి హిసార్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చాలా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
కారులో ప్రయాణిస్తున్న మృతుల వివరాలు తెలియరాలేదు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫతే పూర్ షెకావతి పోలీసులు మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >