| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జ్ఞాపకాలే.. సంతకాలై... మహతిలో ఘనంగా "సిగ్నేచర్స్ డే" సంబరాలు

జ్ఞాపకాలే.. సంతకాలై... మహతిలో ఘనంగా "సిగ్నేచర్స్ డే" సంబరాలు

అనుబంధాలకు సాక్ష్యాలుగా విద్యార్థులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ముచ్చటైన భవిష్యత్తు కోసం మూడేళ్ల డిగ్రీ కోర్సులో చేరిన విద్యార్థులు అందరూ తమ కళాశాలతో ఉన్న అనుబంధాన్ని ఒక్కసారిగా గుర్తు చేసుకుని తన్మయులయ్యారు. ఉన్నత విద్యాభ్యాస సమయంలో ఏర్పడిన కొత్త స్నేహాలు, వారితో కలిగిన గాఢమైన అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. తిరిగి రాని కాలాన్ని గుర్తు చేసుకుని స్నేహానికి గుర్తుగా తమ అంతరంగమే వేదికగా సాక్షి సంతకాలు చేసుకున్నారు. అపురూపమైన ఈ దృశ్యానికి పట్టణంలోని మహతి మహిళా డిగ్రీ కళాశాల వేదికగా మారింది. బుధవారం కళాశాల ప్రాంగణంలో ఫైనల్ ఇయర్ విద్యార్థులచే నిర్వహించిన "సిగ్నేచర్ డే" సంబరాలు అంబరాన్ని తాకాయి. కళాశాలతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు, అనుభవాలు, అనుభూతులన్నింటికీ కలబోసుకుని సంబరాలను వైభవంగా జరుపుకున్నారు. తమ స్నేహానికి గుర్తుగా గ్రూప్ ఫొటోలు తీసుకున్నారు. సెల్ఫీలతో సందడి చేశారు. ఒకే రకమైన యునిఫాం వేసుకుని తమ స్నేహితులపై ఉన్న అభిప్రాయాలతో కూడిన కొటేషన్లు రాసి సంతకాలు చేసుకున్నారు. కలిసి విందు వినోదాల్లో మునిగి తేలారు. మరో భవిష్యత్తు కోసం తప్పని సరి పరిస్థితుల్లో విడిపోతున్నందుకు విచారిస్తూనే గురువుల ఆశీస్సులు అందుకున్నారు. మూడేళ్ల కాలంలో ముప్పయి ఏండ్ల భవిష్యత్తుకు సరిపడా జ్ఞానాన్ని అందించిన మహతి ప్రాంగణానికి, నిర్వాహకులకు, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. నేర్చుకున్న జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహింబాలని కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ పి. రాజు, ఫౌండర్ ప్రిన్సిపాల్ గెంట్యాల భూమేశ్ విద్యార్థులకు పిలుపునిచ్చాడు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు తోట రాజేందర్, డి. రమేశ్, డి. శ్రీలక్ష్మి, ఎన్. శరత్ బాబు, పి. శ్రీనివాస్, చంద్రశేఖర్ విద్యార్థులు పాల్గొన్నారు.


Previous ఉపాధ్యాయులకు నైట్ డ్యూటీలు కాదు…పిల్లలపై మానసిక వత్తిడి తగ్గించండి : టిఎస్ యుటిఎఫ్
Next ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు : బుడ్డ భాగ్యరాజ్
ADVERTISEMENT