| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఉపాధ్యాయులకు నైట్ డ్యూటీలు కాదు…పిల్లలపై మానసిక వత్తిడి తగ్గించండి : టిఎస్ యుటిఎఫ్

ఉపాధ్యాయులకు నైట్ డ్యూటీలు కాదు…పిల్లలపై మానసిక వత్తిడి తగ్గించండి : టిఎస్ యుటిఎఫ్

టిఎస్ యుటిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో అప్రమత్తమైన సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి నైట్ డ్యూటీ ఉపాధ్యాయుల సంఖ్యను రెండు నుండి నాలుగుకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. ఉపాధ్యాయులు వంతుల వారీగా రాత్రి కాపలా కాయాలని ఉత్తర్వుల్లో పేర్కొనటాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) తీవ్రంగా ఖండిస్తున్నది.

గురుకుల ఉపాధ్యాయులను రాత్రి కాపలాదారు స్థాయికి దిగజార్చడం తీవ్ర అభ్యంతరకరం. 

విద్యార్థుల ఆత్మహత్యలకు వారిపై పెరిగిన మానసిక వత్తిడి కారణం. ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వింతైన ఉత్తర్వులు ఇవ్వటం సమంజసం కాదు. 

ఇంటర్, పదవ తరగతిలో ఉత్తమమైన ఫలితాల పేరిట విద్యార్థులను కార్పొరేట్ విద్యాసంస్థల తరహాలో వత్తిడికి గురిచేస్తూ మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ఆ కారణంగానే కార్పొరేట్ విద్యా సంస్థలకు పరిమితమైన ఆత్మహత్యలు గురుకుల విద్యాసంస్థలకు పాకినాయి. వీటికి కారణాలను అధ్యయనం చేసి, నివారణ కోసం శాస్త్రీయమైన చర్యలు చేపట్టటానికి మానసిక నిపుణులతో కూడిన అధ్యయన కమిటీని నియమించాలని టిఎస్ యుటిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు పాకాల శంకర్ గౌడ్ డిమాండ్ చేసారు.

అత్యధిక గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో నిర్వహిస్తూ విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించటంలో వైఫల్యం ఉంది. మెస్ చార్జీలు పెంచుతామని చెప్పి రెండేళ్ళు గడిచినా జిఒ ఇవ్వలేదు.

ఎండలను తట్టుకోవడానికి విద్యార్థులకు పుచ్చకాయలు, చల్లని మజ్జిగ, చల్లని నీరు, అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కానీ అదనపు బడ్జెట్ ఇవ్వకుండా ఎలా సాధ్యమో అధికారులే చెప్పాలి. 

ఉపాధ్యాయులపై ఇప్పటికే బోధనేతర పనుల భారం అధికంగా ఉంది. ఇప్పుడు రాత్రి  డ్యూటీలో ఉండే ఉపాధ్యాయుల సంఖ్యను పెంచడం ద్వారా వారిపై వత్తిడి మరింత పెరుగుతుంది.

కనుక ఉపాధ్యాయులను నైట్ వాచ్ మన్ లు గా మార్చకండి. విద్యార్థులపై మానసిక వత్తిడిని తగ్గించి ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునే విధంగా ప్రోత్సహించాలని టిఎస్ యుటిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్ రావు, ఉపాధ్యక్షులు రమేష్,కోశాధికారి రవీందర్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Previous బి‌ఆర్‌ఎస్ పార్టీకి బిగ్ షాక్...
Next జ్ఞాపకాలే.. సంతకాలై... మహతిలో ఘనంగా "సిగ్నేచర్స్ డే" సంబరాలు
ADVERTISEMENT