Posted on 2024-04-09 13:27:30
డైలీ భారత్, భద్రాచలం: ఇవాళ్టి నుండి భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామ నవమి వసంతపక్ష తిరు కళ్యాణ నవాహ్నిక బ్రహ్మో త్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి.
నేటి నుండి ఈ నెల 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.ఉదయం అంతరాలయం లోని ధ్రువ మూర్తుల వద్ద ఉత్సవాలకు అనుజ్ఞ తీసుకొని ధ్వజారో హణం చేయనున్నారు.
వేడుకల ప్రారంభానికి ముందుగా విశ్వక్సేన ఆరాధన, కర్మణ పుణ్యా హవాచన, రుత్విగ్వరణం, రక్షాబంధనం, స్నపన తిరు మంజనం, వాస్తు హోమం, ఉగాది పర్వదినం సంద ర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఉగాది ప్రసాద వితరణ, సాయంత్రం దర్బార్ సేవ తర్వాత నూతన పంచాంగ శ్రవణం తదితర కార్యక్రమాలను చేపట్టనున్నారు.
అలాగే కల్పవృక్ష వాహనంపై తాత గుడి సెంటర్ వరకు స్వామివారికి తిరువీధి సేవ నిర్వహించనున్నారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవస్థానం ఈవో రమాదేవి తెలిపారు.
ఈ నెల 16వ తేదీన సాయంత్రం నేత్రపర్వంగా ఎదుర్కోలు ఉత్సవం, 17వ తేదీన శ్రీరామనవమి కళ్యా ణ మహోత్సవం, 18వ తేదీన పట్టాభిషేక మహోత్స వం జరగనున్నాయి.
బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా మిథిలా ప్రాంగణంలో జరిగే వేడుకల కోసం కల్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దు తున్నామని ఈవో వెల్లడించారు.
ప్రతి భక్తునికి స్వామివారి తలంబ్రాలు అందేలా ఈసారి 60 తలంబ్రాల కౌంటర్లు, స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులు కొను గోలు చేసేందుకు 19 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. భక్తుల సౌకర్యం కోసం 2.50 లక్షల లడ్డూలు, 5 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేశామని ఈవో రమాదేవి పేర్కొన్నారు...
2003 DSC ఉపాధ్యాయుల చలో హైదరాబాద్ మహా విజ్ఞాపన సభకు టీపీటీఫ్ పూర్తి మద్దతు
Posted On 2026-03-05 22:09:37
Readmore >
ఓంకారేశ్వర ఆలయా అభివృద్ధికి కృషి చేస్తా సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి
Posted On 2026-03-05 22:08:10
Readmore >
ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ అందజేసిన కెనరా బ్యాంకు మేనేజర్ వేగి శ్రీహరి
Posted On 2026-03-05 22:00:22
Readmore >
కరకగూడెం మండలం అశ్వాపురం పాడు గ్రామంలో వ్యక్తి దారుణ హత్య పలువురు అరెస్ట్
Posted On 2026-03-05 21:59:32
Readmore >
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >