Posted on 2024-04-09 19:14:01
డైలీ భారత్, పర్లాఖిమిడి: అక్రమంగా రవాణా చేస్తున్న వన్యప్రాణుల చర్మాలను గజపతి జిల్లా అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా అటవీశాఖ అధికారి ఎస్. ఆనంద్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
జిల్లాలో వన్యప్రాణుల చర్మాలను అక్రమంగా రవాణా చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ సమాచారం వచ్చిందన్నారు. దీంతో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది వివిధ బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారన్నారు.
శనివారం రాయగడ సమితి మండలసాహి ప్రాంతంలో తనిఖీ చేపట్టగా అనుమానితులైన ముగ్గురి వద్ద నుంచి వన్యప్రాణుల చర్మాలు లభ్యమయ్యాయి. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. మరో ముగ్గురికి ఇందులో సంబంధం ఉందని వీరి వద్ద నుంచి ఏడు వన్యప్రాణుల చర్మాలను 5 చిరుతపులి, చిరుతపులి పిల్లి(లియోపర్క్యాట్), బవురోపిల్లి చర్మం, 26.1 కిలోల అలుగు పొలుసులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. నిందితుల్లో ఇద్దరు రాయగడ సమితికి చెందిన మోహన, ఆర్. ఉదయగిరిగా గుర్తించాం. వీరికి అంతరాష్ట్ర ముటాతో సంబంధాలున్నాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాం.
2003 DSC ఉపాధ్యాయుల చలో హైదరాబాద్ మహా విజ్ఞాపన సభకు టీపీటీఫ్ పూర్తి మద్దతు
Posted On 2026-03-05 22:09:37
Readmore >
ఓంకారేశ్వర ఆలయా అభివృద్ధికి కృషి చేస్తా సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి
Posted On 2026-03-05 22:08:10
Readmore >
ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ అందజేసిన కెనరా బ్యాంకు మేనేజర్ వేగి శ్రీహరి
Posted On 2026-03-05 22:00:22
Readmore >
కరకగూడెం మండలం అశ్వాపురం పాడు గ్రామంలో వ్యక్తి దారుణ హత్య పలువురు అరెస్ట్
Posted On 2026-03-05 21:59:32
Readmore >
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >