Posted on 2024-04-08 14:36:56
డైలీ భారత్, న్యూ ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈరోజు తీవ్ర నిరాశ ఎదురయింది.
కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరిం చింది. ఆమె బెయిల్ పిటి షన్ ను కొట్టివేసింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో… తనకు బెయిల్ మంజూరు చేయా లని కోర్టును కవిత కోరారు.
అయితే, కవిత బెయిల్ పై బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో ఈడీ వాదనలు వినిపిం చింది. ఇప్పటికే కొందరిని కవిత బెదిరించిందని కోర్టుకు తెలిపింది.
ఈడీ వాదనలతో ఏకీభ వించిన కోర్టు… కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది.లిక్కర్ కేసులో కవితను మార్చి 15వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. తొలుత ఈడీ కస్టడీలో ఉన్న కవితకు కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.
ఈ క్రమంలో, మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. రేపటి తో ఆమె జ్యుడీషియల్ రిమాండ్ ముగియబోతోంది. ఆమె జ్యుడీషియల్ రిమాం డ్ ను కోర్టు పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు
Posted On 2026-03-06 20:44:04
Readmore >
మంచినేనిపేట : 23 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి
Posted On 2026-03-06 20:36:31
Readmore >
భద్రాచలంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ 287వ జయంతి వేడుకలు
Posted On 2026-03-06 20:11:17
Readmore >
నిరుద్యోగాన్ని అంతం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
Posted On 2026-03-06 20:09:42
Readmore >
TSUTF(తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) కు రాజీనామా చేసిన తంగళ్ళపల్లి మండల శాఖ
Posted On 2026-03-06 20:04:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లాకు ప్రతిష్టాత్మకం కోర్టు భవన నిర్మాణం
Posted On 2026-03-06 17:24:18
Readmore >
ఆదివాసీలపై అటవీశాఖ అధికారుల దాడులు తక్షణమే ఆపాలి...బీజేపీ నాయకులు తంబల్ల రవి
Posted On 2026-03-06 15:20:39
Readmore >