| Daily భారత్
Logo




ప్రత్యేక వైద్య నిపుణుల సేవలు వినియోగించుకోవాలి

News

Posted on 2026-03-06 15:28:51

Share: Share


ప్రత్యేక వైద్య నిపుణుల సేవలు వినియోగించుకోవాలి

ఈ నెల 6 వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు షెడ్యూల్ విడుదల.

డైలీ భారత్, సిరిసిల్ల: “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” 99 రోజుల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య నిపుణుల సేవలు వినియోగించు కోవాలని 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. ఎస్ రజిత తెలిపారు. అన్ని వయసుల వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. నిర్దేశిత రోజులలో నాలుగు దశలలో నిర్వహిస్తామని వివరించారు. మొదటి దశలో మార్చి 6 నుండి మార్చి 31 వరకు గర్భిణీలు, వృద్ధులకు రక్తహీనత నిర్ధారణ పరీక్షలు తెలంగాణ డయాగ్నొస్టిక్స్ సెంటర్ ద్వారా ఆరోగ్య సేవలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు, ఆర్ బీ ఎస్ కే  బృందాలు, ఇతర వైద్య సిబ్బందికి గర్భిణీ స్త్రీలకు , తల్లులకు అందవలసిన పోషకాహారము, వ్యాధినిరోధక టీకాలపై అవగాహన కల్పించడంతోపాటు గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లపై ఆరోగ్య పరీక్షలు ప్రత్యేక వైద్య నిపుణుల ప్రసూతి స్త్రీ రోగనిపుణులు, పిల్లల వైద్య నిపుణులు, నేత్ర, కీళ్ల ఎముకల, దంత వైద్య నిపుణులతో పాటు జనరల్ మెడిసిన్ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీన గర్భాశయ క్యాన్సర్ రాకుండా స్త్రీలకు హెచ్ పీవీ వ్యాక్సిన్ ఇస్తామని పేర్కొన్నారు. 

ప్రత్యేక వైద్య నిపుణులతో

ఈ తేదీల్లో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఈ నెల (మార్చి )

7వ తేదీన హనుమాజిపేట, 

9వ తేదీన కోనరావుపేట, 

10 వ తేదీన లింగన్నపేట, 

11 వ తేదీన పోతుగల్, 

12 వ తేదీన విలాసాగర్, 

13 వ తేదీన ఎల్లారెడ్డిపేట, 

14 వ తేదీన పెద్దలింగాపూర్, 

16 వ తేదీన నేరెళ్ల, 

17 వ తేదీన తంగళ్ళపల్లి,

18 వ తేదీన కొదురుపాక, 

20 వ తేదీన సిరిసిల్లలోని సుందరయ్య నగర్ అర్బన్ హెల్త్ సెంటర్, 

23 వ తేదీన సిరిసిల్లలోని అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్  నగర్, 

24వ తేదీన చీర్లవంచ, 

25 వ తేదీన బోయినపల్లి, 26 వ తేదీన కోనరావుపేట,28 వ తేదీన పోతుగల్, 

30 వ తేదీన విలాసాగర్, 

ఈ నెల (మార్చి) 31 వ తేదీన సిరిసిల్లలోని సుందరయ్య నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ లో  ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య ఆరోగ్య శిబిరాలు, పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తామని  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత తెలిపారు.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >