Posted on 2026-03-06 16:14:04
డైలీ భారత్, రామగుండం: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి,మంచిర్యాల జోన్ పరిధిలో పిల్లల భద్రత,సంరక్షణతో పాటు మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో చైల్డ్ సేఫ్టీ, ప్రొటెక్షన్ మరియు యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలను పోలీస్ అధికారులు ఈ రోజు నిర్వహించారు. సమాజంలో చిన్నారులపై జరుగుతున్న వివిధ రకాల నేరాలు, వేధింపులు,అలాగే యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.అధికారులు మాట్లాడుతూ పిల్లల భద్రత మరియు మాదకద్రవ్యాల నియంత్రణ సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు స్థానిక ప్రజలకు చిన్నారుల భద్రతకు సంబంధించిన ముఖ్యమైన సూచనలు తెలియజేశారు. పిల్లలు ఎలాంటి ప్రమాద పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఎలా స్పందించాలి, అపరిచిత వ్యక్తుల నుండి ఎలా జాగ్రత్త పడాలి, ఆన్‌లైన్‌లో ఎదురయ్యే మోసాలు మరియు సైబర్ ప్రమాదాల నుండి ఎలా రక్షించుకోవాలి అనే అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు.అదే విధంగా యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, కుటుంబ మరియు సామాజిక సమస్యల గురించి వివరించారు. డ్రగ్స్ వినియోగం వల్ల వ్యక్తిగత జీవితంతో పాటు సమాజానికి కలిగే నష్టాన్ని కూడా వివరించారు. మాదకద్రవ్యాల బారిన పడకుండా యువత తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలని సూచించారు.
పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సమాజం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. చిన్నారులపై ఏవైనా అనుమానాస్పద సంఘటనలు గమనించినప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అలాగే మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగం గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >