Posted on 2024-03-19 18:17:52
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో రైటర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ సురేందర్ రైటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మెదక్ మండలం అవుసుల పల్లికి చెందిన కందుల రాములు ఇసుక ట్రాక్టర్ విడుదల విషయంలో రైటర్ సురేందర్ రూ. 15 వేలు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇస్తేనే ఇసుక ట్రాక్టర్ విడుదల చేస్తామని చెప్పడంతో రూ. 15 వేలు రైటర్ సురేందర్‌తో ఒప్పందం కుదుర్చుకొని మొదటగా నాలుగు వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. డబ్బులు డిమాండ్ చేసిన కానిస్టేబుల్ పై బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుడితో మాట్లాడిన అధికారులు మంగళవారం పక్కా ప్రణాళికతో వచ్చి డబ్బులు నాలుగు వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది.. వారం రోజుల క్రితం పది వేలు ఇచ్చిన బాధితుడు మరోసారి డిమాండ్ చేయడం వల్లనే ఏసీబీనీ ఆశ్రయించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ చికెన్ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి
Posted On 2025-02-14 12:59:03
Readmore >మోడీ నాకు మంచి ఫ్రెండ్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
Posted On 2025-02-14 11:01:32
Readmore >అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Posted On 2025-02-14 09:54:09
Readmore >మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Posted On 2025-02-13 20:31:33
Readmore >రంగరాజన్ పై దాడి కేసు... విచారణలో నేరాన్ని అంగీకరించిన వీరరాఘవరెడ్డి!
Posted On 2025-02-13 08:02:45
Readmore >బి సి లకు స్థానిక సంస్థల్లో 42 శాతం కేటాయిస్తూ చట్టం చేయాలి
Posted On 2025-02-12 23:33:40
Readmore >