Posted on 2023-10-12 14:31:11
10వ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజు
వారం క్రితం కలెక్టర్ కు వినతి, స్పందించని డిఇఓ
డైలీ భారత్, సిరిసిల్ల: పట్టణంలోని పదో వార్డు మున్సిపాలిటీ పరిధిలోని ముష్టిపల్లిలోని ప్రాథమిక పాఠశాలను వెంటనే తెరిపించాలని పదో వార్డు కౌన్సిలర్ బొల్గం నాగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కాలనీ వాసులతో కలిసి ఆయన పాఠశాల ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నాగరాజు మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాల నుంచి ప్రాథమిక పాఠశాల మూసి ఉందని, వారం రోజుల క్రితం జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశామన్నారు. మూడు రోజుల్లో పాఠశాలను తెరిపించాలని డిఈఓ కు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా, ఇప్పటివరకు జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పాడికే పాఠశాలలో పనిచేసే ఇద్దరు ఉపాధ్యాయులను దగ్గరలోని రాజీవ్ నగర్ పాఠశాలకి డిప్యూటేషన్ పై పంపించడం జరిగిందన్నారు. దీనివల్ల పిల్లల భారత రాజ్యాంగంలో తెలుపబడిన ఆర్టికల్ 21 ఏ ఉల్లంఘనకు గురికాబడిందన్నారు. ఈ ఆర్టికల్ ప్రకారం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాల, బాలికలకు కచ్చితంగా ఉచిత నిర్బంధ విద్యను అందించాల్సిన విది ప్రభుత్వానికి ఉంటుందని, ఈ రెండు సంవత్సరాల నుండి ముష్టిపల్లిలోని బాల బాలికలు పాఠశాలకు వెళ్ళ లేక పోతున్నారని, ఈ పాఠశాల మూసివేత వల్ల వేల రూపాయలు కట్టలేక ప్రైవేట్ స్కూల్స్ కి పంపలేక తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వెంటనే పాఠశాలను తెరిచి, ఇద్దరి ఉపాధ్యాయుల డిప్యూటేషన్ రద్దుచేసి, పిల్లలకు ఉచిత విద్య అందించాలని నాగరాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిట పాల్గొన్నారు.
రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
Posted On 2026-08-15 18:03:53
Readmore >
16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
Posted On 2026-08-15 17:50:48
Readmore >
గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు
Posted On 2026-08-15 17:49:14
Readmore >
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 13:43:20
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >