| Daily భారత్
Logo




ఆస్తి పన్ను చెల్లించలేదా? అయితే మీకోసమే మునిసిపల్ శాఖ ఓటిఎస్ ఆఫర్

News

Posted on 2024-02-29 06:33:42

Share: Share


ఆస్తి పన్ను చెల్లించలేదా? అయితే మీకోసమే మునిసిపల్ శాఖ ఓటిఎస్ ఆఫర్

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా బ్యూరో : మీరు మీ ఆస్తి పన్ను ఇంకా కట్టలేదా?.. పన్ను బకాయిలు భారీగా పేరుకుపోయాయా.. అయితే మీ బకాయిలు చెల్లించుకునేందుకు ఇదే చక్కని అవకాశం..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తి పన్ను బకాయిలపై విధించే వడ్డీ పై 90 శాతం రాయితీ  ప్రభుత్వం ప్రకటించింది.

ఇందుకోసం  ‘వన్ టైమ్ స్కీమ్’ (Property Tax one time scheme ) అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఓటిఎస్ కింద ప్రభుత్వం ఆస్తి పన్నుపై పేరుకుపోయిన బకాయిల వడ్డీపై 90 శాతం మాఫీ చేస్తుంది.

2022 23 సంవత్సరం వరకు ఆస్తి పన్ను పూర్తిగా చెల్లించే వారికి మాత్రమే ఈ వడ్డీ రాయితీ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.

పాత బకాయిలపై కేవలం 10 శాతం వడ్డీ ఒకేసారి చెల్లించేలా వన్ టైం స్కీం తీసుకొచ్చినట్టు తెలిపారు. 2023 మార్చి నాటికి ఆస్తి పన్ను, వడ్డీ, జరిమానాలు చెల్లించిన వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని వారు చెల్లించిన 90% వడ్డీ మొత్తాన్ని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) ఆర్డర్ ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరం  సర్దుబాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.

మొత్తం బకాయిలు + బకాయిల వడ్డీ : రూ. 9,803.39 కోట్లు

OTS (2022-23)కి అర్హత కలిగిన అసెస్‌మెంట్‌ల సంఖ్య : 5,25,709

ఆస్తి పన్ను వసూళ్లు (లక్ష్యం 2023-24 కోట్లు) : 2,10 కోట్లు (జనవరి 2024 వరకు) : 1,268.49 కోట్లు.

Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >