| Daily భారత్
Logo




కేబీఆర్‌ ఉద్యానవనంలో నిజాం కాలం నాటి పెట్రోల్‌ పంపు

News

Posted on 2024-02-29 06:32:15

Share: Share


కేబీఆర్‌ ఉద్యానవనంలో నిజాం కాలం నాటి పెట్రోల్‌ పంపు

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా బ్యూరో : కేబీఆర్‌ ఉద్యానవనంలో నిజాం కాలం నాటి పెట్రోల్‌ పంపు ఒకటి బయటపడింది. ఉద్యానంలో నడకకు వచ్చే పలువురు అటుగా సాగుతున్న క్రమంలో దీనిని గుర్తించారు. సంబంధిత చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. నిజాం తన కార్లు, ట్రక్కులు ఇతర మోటారు యంత్రాలలో ఇంధనం నింపేందుకు దీనిని ఉపయోగించినట్లు తెలుస్తోంది. రాజు అల్లూరి అనే వ్యక్తి ఈ పెట్రోల్‌ పంపు చిత్రాలను తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఇన్నాళ్లూ చెట్ల పొదల్లో దాగి ఉన్న ఈ పెట్రోల్‌ పంపు వేసవి కావడంతో పచ్చదనం తగ్గి బయటపడింది. గత సంపదకు ఇదే సాక్ష్యం అంటూ రాజు అల్లూరి తన ఖాతాలో పేర్కొన్నారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోనూ కనిపించడంతో ఇప్పుడు ఇక్కడి పెట్రోల్‌ పంపును చూడటానికి నడకదారులు ఆసక్తి చూపుతున్నారు.

Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >