| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: బాలికపై లైంగిక వేధింపుల కేసులో పోలీసుల తీరుపై బాధిత కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలిక మేనమామ నరేష్‌  మాట్లాడుతూ.. తమ మేనకోడలిని రాజ్‌కుమార్ అనే వ్యక్తి లైంగికంగా వేధించాడని, ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తానంటూ రాజ్‌కుమార్ తమ కుటుంబాన్ని బెదిరించాడని తెలిపారు. 

2026 మే 16న షాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసులు దానిని సీరియస్‌గా తీసుకోలేదని ఆరోపించారు. అంతేకాకుండా, 2025 మార్చి 4న బాలిక తండ్రి మల్లేష్ ఆకస్మికంగా మరణించగా, మల్లేష్‌ను చంపినట్టే మిమ్మల్నీ చంపుతాను అంటూ నిందితుడు తమ కుటుంబాన్ని బెదిరించాడని నరేష్ తెలిపారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దర్యాప్తును తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించారు. ఎస్ఐ రమేష్‌, సీఐ కాంతారెడ్డి కేసును సక్రమంగా విచారించలేదని, నిందితుడికి పోలీసులే అండగా నిలుస్తున్నారని విమర్శించారు. పోలీసులు తమకు న్యాయం చేసేవరకు నిరసన విరమించబోమని నరేష్ స్పష్టం చేశారు..

Previous జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత
Next సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్
ADVERTISEMENT