| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :ఆస్తి ఆశతో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి తన సొంత మేనమామను కిరాతకంగా హత్య చేసిన ఘటన సిరిసిల్లలో కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సిరిసిల్ల టౌన్ CI శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, శ్రీకాంత్ గతంలో కూలీ పని చేసేవాడు. కానీ మద్యానికి బానిసై పని మానేసి జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో 6 సంవత్సరాల క్రితం భార్య, ఇద్దరు పిల్లలు అతన్ని వదిలి వెళ్లిపోయారు.

అప్పటి నుంచి తల్లితో కలిసి ఉంటూ తాగడానికి డబ్బులు అడిగి ఆమెను వేధించేవాడు. 5 నెలల క్రితం మేనమామ రాగుల ఎల్లయ్య ఇంట్లో గొడవపడగా, ఎల్లయ్య అతన్ని అందరి ముందు మందలించాడు. దీన్ని అవమానంగా భావించిన శ్రీకాంత్ కక్ష పెంచుకున్నాడు.

ఎల్లయ్యకు వారసులు లేరని, అతన్ని చంపితే ఇల్లు తనకు వస్తుందని, ఆ ఇంటిని అమ్మి వచ్చిన డబ్బుతో జల్సా చేయాలని పథకం వేశాడు.

తేదీ 04-07-2026 న సిరిసిల్ల మార్కెట్‌లో ఎల్లయ్యను కలిసిన శ్రీకాంత్, అతన్ని పెద్దూరు శివారుకు తీసుకెళ్లాడు. అక్కడ కల్లు, మద్యం తాగించి మత్తులో ఉన్న సమయంలో మొదట గొంతు నులిమాడు. ప్రతిఘటించడంతో దగ్గర్లో ఉన్న బండరాయితో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం శవాన్ని పాత బట్టలతో కప్పి పారిపోయాడు.

మరుసటి రోజు ఎల్లయ్య కనిపించకపోవడంతో అతని బంధువు రాగుల శారద సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ హైదరాబాద్‌కు పారిపోతుండగా, సిరిసిల్ల ఎల్లమ్మ చౌక్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు నిందితుని వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం మరియు హత్యకు ఉపయోగించిన బండరాయి ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు CI శ్రీనివాస్ తెలిపారు.

నిందితుని వివరాలు

పేరు: పుప్పాల శ్రీకాంత్ 

వయస్సు: 35 సంవత్సరాలు

తండ్రి: రాజయ్య

నివాసం: B.Y నగర్, సిరిసిల్ల, ప్రస్తుతం న్యూ అర్బన్ కాలనీ, వేములవాడ

Previous నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్
Next ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
ADVERTISEMENT