| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ఆరుగురు హత్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు పి. రాజ్‌కుమార్‌ను పట్టుకునేందుకు దారితీసే విశ్వసనీయ సమాచారం అందించిన వారికి ₹2,00,000/- (రూ. రెండు లక్షలు) నగదు బహుమతి అందజేయనున్నట్లు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ప్రకటించింది. ఈ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప్ర‌క‌ట‌న ప్ర‌కారం.. నిందితుడి ఆచూకీ తెలిపి అతని అరెస్టుకు దారితీసే విశ్వసనీయ సమాచారం అందించిన వారికి ₹2 లక్షల బహుమతి అందజేయబడుతుంది. సమాచారం అందించిన వ్యక్తి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు, వారి భద్రతకు పూర్తి హామీ ఇవ్వబడుతుందని ప్ర‌క‌ట‌నలో పేర్కొంది. నిందితుడి గురించి ఏవైనా వివరాలు తెలిసిన వారు చేవెళ్ల పోలీస్ కంట్రోల్ రూమ్‌ 8712665324 నంబర్‌కు ఫోన్ కాల్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించి సమాచారం అందించవచ్చని వెల్ల‌డించింది.

Previous సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్
Next ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత
ADVERTISEMENT