డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : బీఎస్-6 (BS-VI) ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న కొత్త వాహనాల యజమానులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్త అందించే అవకాశం ఉంది.
పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC)సర్టిఫికెట్ చెల్లుబాటు కాలాన్ని గణనీయంగా పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం బీఎస్-6 వాహనాలకు నిర్దిష్ట వ్యవధిలో కాలుష్య పరీక్షలు నిర్వహించి పీయూసీ సర్టిఫికెట్‌ను పునరుద్ధరించాల్సి ఉండగా, కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఆరు సంవత్సరాల లోపు ప్రైవేట్ బీఎస్-6 వాహనాలకు ఒకేసారి మూడేళ్ల వరకు చెల్లుబాటు కల్పించే అవకాశం ఉంది.