డాక్టర్ సురేంద్రబాబు, పిల్లల వైద్య నిపుణులు, అమృత చిల్డ్రన్స్ హాస్పిటల్ సిరిసిల్ల
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పిల్లలు మోసే పాఠశాల బ్యాగ్ బరువు వారి శరీర బరువులో 10–15 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. అధిక బరువు ఉన్న బ్యాగ్ వల్ల వెన్నునొప్పి, భుజాల నొప్పి, మెడ సమస్యలు, భవిష్యత్తులో శారీరక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాగ్ కు రెండు భుజాల పట్టీలు ఉండాలి. అవి మృదువైన కుషన్‌తో ఉండటం మంచిది. బ్యాగ్ పిల్లల శరీరానికి సరైన పరిమాణంలో ఉండాలి. బ్యాగ్‌ను వెనుక భాగంలో సరిగ్గా ధరించాలి. వేలాడేలా వుండకూడదు. బ్యాగ్‌ను ఎప్పుడూ ఒక భుజంపై మాత్రమే మోయ కూడదు..రెండు పట్టీలను ఉపయోగించి సమంగా మోయాలి. అవసరం లేని పుస్తకాలు, వస్తువులు తీసుకెళ్లకుండా అధిక బరువును నివారించాలి. సరైన బ్యాగ్ వినియోగం పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, మంచి భంగిమ, వెన్నెముక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది.