Posted on 2026-06-20 19:05:45
రూ.91 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్.
రూ.14.16 లక్షల నగదు స్వాధీనం – రూ.46.21 లక్షలు బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్.
సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ ట్రక్ చిట్లు సృష్టించి, సుమారు 91 లక్షల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన Cr.No.351/2026 U/Sec. 61(2), 318(4), 316(2), 316(5) r/w 3(5) BNS కేసులో ఆరుగురు నిందితులను సిరిసిల్ల టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..
సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాంలో మేనేజర్‌గా పనిచేస్తున్న కరీంనగర్ కి చెందిన ఉత్కం విజయ్ (A1), అతనితో పనిచేస్తున్న వేములవాడ రూరల్ అచ్చనపల్లి గ్రామానికి చెందిన వాసాల గణేష్ (A5) కలిసి ఐకేపీ కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లు నకిలీ ట్రక్ షీట్లు తయారు చేశారు.
ఈమొసంలో భాగంగా రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్‌చార్జ్ గడ్డం స్వామి (A3) రెండు లారీలకు నకిలీ ట్రక్ చీటీలు జారీ చేయగా, వాటిని ఉత్కం విజయ్ సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయగా అనంతరం నిధులను నిందితులు పంచుకున్నారు.
అదేవిధంగా, డీఎంఓ కార్యాలయంలో మండల స్థాయి కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న కమ్మరి రాజశేఖర్ (A2), బద్దెనపల్లి పీఏసీఎస్ కేంద్రం ఇన్‌చార్జ్ గాజుల నవీన్ (A6)తో కలిసి ఒక లారీ ధాన్యానికి నకిలీ ట్రక్ చీటీ రూపొందించి ఉత్కం విజయ్‌కు అందించారు. అతను దానిని సివిల్ సప్లై వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయగా, రాజశేఖర్ ఆమోదం తెలిపాడు. విడుదలైన నిధులను ముగ్గురు పంచుకున్నారు.
ఇంకా, వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి అపారెల్ పార్క్ గోదాంకు వచ్చిన 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండా, ఆన్‌లైన్‌లో మాత్రం దించినట్లు నమోదు చేశారు. అనంతరం ఆ ధాన్యాన్ని వేములవాడకు చెందిన చెపూరి మధుకర్ (A4)కు అప్పగించగా, అతను సిద్ధిపేటకు చెందిన కమిషన్ ఏజెంట్ చిటుకుల శ్రీకాంత్ (A7) ద్వారా వివిధ రైస్ మిల్లులకు విక్రయించి వచ్చిన మొత్తాన్ని పరస్పరం పంచుకున్నారు.
పై మోసాలను గుర్తించిన జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఎస్. నరసింహ సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి డిఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా దర్యాప్తులో భాగంగా సుమారు రూ.91 లక్షల ప్రభుత్వ నిధులను అక్రమంగా మళ్లించినట్లు విచారణలో తేలింది.
నిందుతులైన నిందితులు A1 ఉత్కం విజయ్, A2 కమ్మరి రాజశేఖర్, A4 చెపూరి మధుకర్, A5 వాసాల గణేష్, A6 గాజుల నవీన్‌లను ఈరోజు అరెస్ట్ చేసి నిందితుల వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, సంబంధిత పత్రాలు,రూ.14,16,800 నగదు స్వాధీనం చేసుకోగా, రూ.46,21,358 మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది.
స్వాధీనం/ఫ్రీజ్ చేసిన మొత్తాలు:
1.ఉత్కం విజయ్ వద్ద నుంచి రూ.2,85,400 నగదు స్వాధీనం, ఖాతాలోని రూ.37,65,358 ఫ్రీజ్.
2.వాసాల గణేష్ వద్ద నుంచి రూ.9,81,400 నగదు స్వాధీనం, అతని ఖాతాలో రూ.4,68,555 మరియు అతని 3.భార్య వాసాల సునీత ఖాతాలో రూ.8,67,711 ఫ్రీజ్.
౩.కమ్మరి రాజశేఖర్ వద్ద నుంచి రూ.1,50,000 నగదు స్వాధీనం.
నిందుతుల వివరాలు..
A1.Utkam Vijay, s/o of Rajamallayya, age:36 yrs, caste: Goud, R/o Vidyanagar, Karimnagar town.
A2.RKammari Rajashekar s/o Narsaiah age: 36 yrs Occ: Mandal Level Co-Ordinator, DMO caste: Mala R/o By Nagar, Sircilla Town.
A3.Gaddam Swamy
A4.Chepuri Madhu @ Madhukar s/o Prasad age: 40 yrs Occ: Owner of Mallikarjuna Rice Mill caste: Vyshya R/o Sainagar Vemulawada Town.
A5.Vasala Ganesh s/o Gangaiah age: 40 yrs caste: Padmashali Occ: Supervisor in SWC, Godown, Apparel Park, Peddur Sircilla R/o Archannapalli villae of Vemulawada Rural.
A6.Gajula Naveen s/o Laxman age: 31 yrs caste: Padmashali Occ: In charge of PACS Baddenapalli village R/o Padmanagar, Thangallapalli village and Mandal.
A7.Chitukula Srikanth s/o Bhumaiah age: 45 yrs caste: Vyshya Occ: Business R/o Mohinipura Street Siddipet Town.
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నకిలీ పత్రాలు సృష్టించి, ధాన్యాన్ని అక్రమంగా విక్రయిస్తూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన ఈ కేసులో మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు – 374 మందికి కోర్టు శిక్షలు
Posted On 2026-06-20 20:28:48
Readmore >
జడ్‌పీహెచ్‌ఎస్ దమ్మన్నపేటలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
Posted On 2026-06-20 19:32:50
Readmore >
ఎన్ఐటీ వరంగల్ మెంటరింగ్ కార్యక్రమానికి దమ్మన్నపేట విద్యార్థి ఎంపిక
Posted On 2026-06-20 19:30:39
Readmore >
40వ ఒలింపిక్ డే 2కే రన్-2026 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ
Posted On 2026-06-20 19:13:51
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అమలులో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాకు 8వ స్థానం
Posted On 2026-06-20 19:13:02
Readmore >
నీట్ ఎగ్జామ్ సెంటర్ లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
Posted On 2026-06-20 19:09:02
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించి రూ.91 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం
Posted On 2026-06-20 19:05:45
Readmore >