| Daily భారత్
Logo




40వ ఒలింపిక్ డే 2కే రన్-2026 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ

News

Posted on 2026-06-20 15:43:51

Share: Share


40వ ఒలింపిక్ డే 2కే రన్-2026 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ

డైలీ భారత్, కామారెడ్డి : ఒలింపిక్ విలువలు, క్రీడాస్ఫూర్తి మరియు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రజల్లో ప్రోత్సహించే లక్ష్యంతో శనివారం కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన 40వ ఒలింపిక్ డే 2కే రన్-2026 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ , జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, క్రీడాకారులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు జెండా ఊపి 2కే రన్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణ, జట్టు భావన, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

విద్యార్థులు మొబైల్ ఫోన్లు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడాస్ఫూర్తితో వివిధ క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను చాటాలని, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించి కామారెడ్డి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో దేశానికి పతకాలు సాధించే క్రీడాకారులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ఎంత శ్రద్ధ చూపుతున్నారో, క్రీడల పట్ల కూడా అంతే ప్రోత్సాహం అందించాలని సూచించారు. క్రీడలు శారీరక, మానసిక వికాసానికి దోహదపడటంతో పాటు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, పోటీతత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

అనంతరం అధికారులు పాల్గొన్న విద్యార్థులు, క్రీడాకారులు, యువతను అభినందించి క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీ విక్టర్ ఎన్.వి. గిరి , కామారెడ్డి డీఎస్పీ శ్రీ మధుసూదన్ , సంబంధిత జిల్లా అధికారులు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కన్వీనర్ డా. కె.పీ. అనిల్ కుమార్ , చైర్మన్ డా. ఎం. జైపాల్ రెడ్డి , క్రీడా సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >