| Daily భారత్
Logo




ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

News

Posted on 2026-06-19 18:25:09

Share: Share


ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

డైలీ భారత్, నారాయణపేట: ప్రజల సొమ్ము దోచుకోనేందుకు సైబర్‌ నేరగాళ్ళు రోజు,రోజుకి కొత్త కొత్త పోకడలతో ప్రజల బలహీనతలను పెట్టుబడిగాచేసుకోనేందుకు సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథాలను ప్రయోగిస్తున్నారు.

మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ స్కీముల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్. IPS  ప్రజలకు  తెలిపారు.

గొలుసుకట్టు వ్యాపారాలు చేస్తూ ప్రజలను మోసం చేసే మల్టిలెవెల్ వ్యాపారాలు పెరుగుతున్నాయి, మీ క్రింద ఎక్కువ మంది ఎజెంట్లను చేర్పించి తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు పొందండి అనే వాటిని నమ్మవద్దు అని ఎస్పీ అన్నారు. ఇలాంటి మల్టీలెవల్ వ్యాపారం చేస్తూ ప్రజల నుండి డబ్బులు సేకరించి ఆర్దికంగా మోసం చేస్తూ చైన్ సిస్టం మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా ఆర్థికపరమైన మోసాలు జరుగుతున్నాయని ప్రజలు గుర్తించాలని కోరారు. ఎక్కువమంది ఏజెంట్లను చేర్పిస్తే రివార్డులు, పాయింట్లు లభిస్తాయని కేటుగాళ్లు ఆశ చూపుతారు. ఇలాంటి వారి మాయమాటలు నమ్మి అత్యాశకు పోతే భారీగా ఆర్థిక నష్టం జరుగుతుంది అన్నారు.

సైబర్ మోసగాళ్ళు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ మోసాల పట్ల ప్రజల్లో అవగాహన పెరగడంతో సైబర్ మోసగాళ్లు మల్టీలెవెల్ మార్కెటింగ్ పై దృష్టి సారించి గొలుసుకట్టు వ్యాపారాల పేరుతో వాట్సప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటనలు చేసి అమాయకులను ఆకర్షించి మోసగించి ఆర్థిక నష్టాన్ని కలగజేస్తారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ ను చాలామంది విదేశాల్లో ఉండి ఒక రాకెట్ లా నడుపుతారు భారీ లాభాలు తోపాటు లగ్జరీ కార్లు, ఫారిన్ టూర్ల పేరిట తమ ముఠాలతో అమాయకులకు వలపన్నుతారని ఎలాంటి మాయ మాటలు నమ్మరాదు అని ఎస్పీ తెలిపారు. 

అతి తక్కువ కాలంలో అధిక లాభాలు వస్తాయని ఎవరైనా చెప్తే అది మోసమని గ్రహించాలి, లేదంటే ప్రజల్ని మాయలోకి దింపి డబ్బులు కొల్లగొడతారు, అత్యాశకు పోతే మోసపోవడం ఖాయం. గొలుసుకట్టు మార్కెటింగ్ లో ముందుగా చేరిన వారికి లాభాలు వస్తాయి ఆ తర్వాత చేరిన వారంతా తీవ్రంగా నష్టపోవాల్సిందే. ఇలాంటి నెట్వర్క్ లో ఎవరు చేరొద్దు ఆయా సంస్థల నిర్వాహకులు, కంపెనీలు పెట్టే సభలు, సమావేశాలకు ఎవరు వెళ్ళవద్దు. సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రకటన పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి, అనుమానాస్పద ప్రకటనలు, వెబ్ లింకులు, ఏపీకె ఫైల్స్ లాంటివి డౌన్లోడ్ చేయవద్దు. మోసపూరిత ప్రకటనలపై, ఆర్థిక మోసాలపై వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు ఫిర్యాదు చేయండి

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >