Posted on 2026-06-19 17:06:40
• పోలీసింగ్ విధానాలను ఎప్పటికప్పుడు నవీకరించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.
• కేసుల దర్యాప్తులో నైపుణ్యాలు పెంపొందించుకుని నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలి.
• ఆస్తి నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి.
• ప్రధాన కూడళ్లు, ప్రజా రద్దీ ప్రాంతాల్లో నిరంతరం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలి.
• వర్షాకాల పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు చర్యలు చేపట్టాలి.
• పేకాట, ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి.
డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసులు, నేరాల నియంత్రణ చర్యలు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పోలీసింగ్ విధానాలను ఎప్పటికప్పుడు నవీకరించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. కేసుల దర్యాప్తులో నైపుణ్యాలను పెంపొందించుకుని నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, శాస్త్రీయ ఆధారాలతో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆస్తి నేరాలు, దొంగతనాలు, ఇతర నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, రాత్రి గస్తీని మరింత ముమ్మరం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని తెలిపారు.
ప్రజల్లో భద్రతా భావన పెంపొందించేందుకు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, సున్నిత ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్‌ను నిరంతరం కొనసాగించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నేరాల నివారణకు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని, గ్రామ పోలీస్ అధికారి వ్యవస్థను మరింత బలోపేతం చేసి సమాచార వ్యవస్థను పటిష్ఠం చేయాలని ఆదేశించారు.
ప్రస్తుత వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలు, పొంగిపొర్లే వాగులు, వంకలు ప్రమాదకర ప్రాంతాల వద్ద ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ కోసం ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని తెలిపారు.
పేకాట, ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని, నిర్వాహకులు మరియు పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, సీసీ కెమెరాల ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలు, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓర్పుతో విని చట్టబద్ధంగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర పోలీసు సిబ్బందికి సూచించారు.
గాంధారి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ వెంట సదాశివనగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. సంతోష్ కుమార్ ఉన్నారు.
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >