Posted on 2026-06-19 15:47:58
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి ప్రధాన కూడలిలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైన సందర్భంగా స్కూల్ బస్సులపై విస్తృత తనిఖీలు చేపట్టిన రవాణా శాఖ అధికారులు, విద్యార్థులకు అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
స్కూల్ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులకు వాహనాల్లో ఏర్పాటు చేసిన అగ్నిమాపక పరికరాల (ఫైర్ ఎక్స్‌టింగ్విషర్) వినియోగ విధానం, అత్యవసర ద్వారాల ద్వారా సురక్షితంగా బయటకు వెళ్లే పద్ధతులపై ప్రత్యక్షంగా ప్రదర్శన నిర్వహించారు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు భయపడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతోనే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ వినియోగాన్ని ప్రదర్శింపజేసి అవగాహన కల్పించారు. రవాణా శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు విశేషంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి దేవునూరి శ్రీనివాస్, మోటారు వాహనాల తనిఖీ అధికారి గంధం వంశీధర్, సహాయక మోటారు వాహనాల తనిఖీ అధికారి పృథ్వీరాజ్ వర్మ, ఫైర్ సబ్ ఇన్‌స్పెక్టర్ నర్మెట నరేందర్ పాల్గొని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. "విద్యార్థుల భద్రతే లక్ష్యంగా స్కూల్ బస్సుల తనిఖీలు, ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయి" అని జిల్లా రవాణా శాఖ అధికారులు తెలిపారు.
రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
Posted On 2026-08-26 17:27:24
Readmore >
సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా
Posted On 2026-08-26 17:11:26
Readmore >
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >