| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అర్బన్ పార్క్ సందర్శించిన విద్యార్థులు..

అర్బన్ పార్క్ సందర్శించిన విద్యార్థులు..

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రజా పాలన ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అర్బన్ పార్క్ సందర్శన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్ల్స్ సిరిసిల్ల స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ట్రెక్కింగ్, వ్యాస రచన, చిత్రలేఖనం (డ్రాయింగ్) పోటీలు నిర్వహించి  విజేతలకు బహుమతులు అందజేశారు.

అలాగే విద్యార్థులు పార్క్‌లోని చెట్లు, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి, వాటి ప్రాముఖ్యత, ఉపయోగాలు, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర గురించి అవగాహన పొందారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమను, పర్యావరణ పరిరక్షణ బాధ్యతను పెంపొందించేందుకు దోహదపడింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వప్న మంజుల, సురేష్ పీడీ పాల్గొన్నారు.

Previous ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Next తాళిపేరు ఎడమ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
ADVERTISEMENT