| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లల్ని చదివించండి : సర్పంచ్ దుంపల చంద్రశేఖర్ రెడ్డి

ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లల్ని చదివించండి : సర్పంచ్ దుంపల చంద్రశేఖర్ రెడ్డి

డైలీ భారత్, ధమ్మన్నపెట్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధమ్మన్నపెట్ ఉపాధ్యాయులు మరియు ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని సీనియర్ ఉపాధ్యాయులు బోయన్నగారి నారాయణ తెలియచేశారు ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే మనకు నాణ్యమైన విద్య లభిస్తుంది కాబట్టి తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించి వ్యయ ప్రయాసాలకు గురికావద్దని కోరారు మౌలిక వసతులు కల్పనలో మేము పాఠశాలకు అండగా ఉంటామని తెలియజేశారు మన ఉన్నత పాఠశాల జాతీయస్థాయిలో గుర్తింపు పొందిందని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతోపాటు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు మనోవికాసం పొందుతున్నారని అన్నారు ఉప సర్పంచ్ హామీద్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతామని హామీ ఇచ్చారు తదనంతరం అందుబాటులో ఉన్న విద్యార్థులకు నోటు పుస్తకాలు మరియు టెక్స్ట్ బుక్స్  అందజేయడం జరిగింది


ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ప్రజాప్రతినిధులు సర్పంచ్ దుంపల చంద్రశేఖర్ రెడ్డి ఉప సర్పంచ్ హమీద్ మరియు వార్డు మెంబర్ స్వామి, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు

Previous ఏసీబీ వలలో ఎంపీడీఓ
Next ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
ADVERTISEMENT