డైలీ భారత్, నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఎంపీడీఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, అలాగే ఎంపీడీఓ కుమారుడు చిక్కినట్లు సమాచారం.
పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్ అనుమతికి సంబంధించి ₹1 లక్ష లంచం డిమాండ్ చేసి, సెటిల్‌మెంట్ జరిగిన నేపథ్యంలో ₹45 వేల నగదు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ వ్యవహారాలను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీడీఓ కుమారుడు కూడా ఏసీబీ అధికారుల విచారణలో ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ACB దర్యాప్తు కొనసాగుతోంది.