Posted on 2026-06-12 04:01:47
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాత్రి సుమారు 12.30 గంటల నుండి 5.00 గంటల వరకు భద్రాచలంలోని లాడ్జీలు, బస్టాండ్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అనుమానిత వ్యక్తులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల ధ్యేయంగా సోదాలు చేపట్టామని డిఎస్పి అరుణ్ కుమార్ తెలిపారు. భద్రాచలం పట్టణంలోని మొత్తం 62 లాడ్జిలతో పాటు స్థానిక బస్టాండ్ పరిసర ప్రాంతాలలో ఈ తనిఖీలు కొనసాగాయి. ఫింగర్ ప్రింట్ డివైస్లులు, డాగ్ స్క్వాడ్ బృందాలతో లాడ్జిలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. సోదాల సమయంలో లాడ్జిల్లా యజమానులు, మేనేజర్లు, సిబ్బంది యొక్క పూర్తి వివరాలు సేకరించి, లాడ్జిలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజ్ కనీసం 2 నెలల పాటు బ్యాకప్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, లాడ్జి వెలుపల రహదారిపై వచ్చి పోయే వాహనాల కదలికలను స్పష్టంగా రికార్డు అయ్యేలా కెమెరాలను రోడ్డు వైపు అమర్చాలని ఆదేశించారు. పట్టణ ప్రజల భద్రత దృష్ట్య ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు. ఎవరైనా అనుమానస్పదంగా కనిపించినట్లయితే పోలీస్ వారికి తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
ఈ తనిఖీల్లో ఇన్స్పెక్టర్ నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్లు, స్పెషల్ పార్టీ సిబ్బంది, మహిళా పోలీసులు, పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >