Posted on 2026-05-21 15:20:39
ఆర్ సెటీ శిక్షణ కోర్సులతో యువతకు మేలు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆర్ సెటీ శిక్షణా కేంద్రం ప్రారంభం
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : ఉచిత శిక్షణను యువతీ యువకులు వినియోగించు కోవాలని, ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, బ్యాంకుల సహకారంతో ఆర్ సెటీ (రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) ఆద్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూ నగర్ శిక్షణా కేంద్రంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గురువారం ప్రారంభించారు. శిక్షణ ఇచ్చే, ట్రైనింగ్, వసతి గదులను ప్రారంభించి.. పరిశీలించారు. ఈ సందర్భంగా మగ్గం వర్క్ కింద శిక్షణ పొంది పలువురు అభ్యర్థులు సిద్ధం చేసిన వస్త్రాలను పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజూ ఎన్ని గంటలు శిక్షణ పొందుతున్నారో ఆరా తీశారు. మగ్గం వర్క్ తర్ఫీదు పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన *ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక* కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు 10 శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న యువజన క్రీడా వారోత్సవాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గతంలో ఉమ్మడి జిల్లా కేంద్రంలోనే ఆర్ సెటీ కేంద్రాలు ఉండేవని, ఇప్పుడు మన జిల్లాలో కూడా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. జిల్లాలోని యువతీ యువకులు ఇక్కడ అందించే ఉచిత వసతి, భోజనం, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. శిక్షణలో భాగంగా అందించే ప్రతి మెలకువను ఎంతో శ్రద్ధ, ఆసక్తితో నేర్చుకొని.. స్వయం ఉపాధిలో ఆ అంశాలు వినియోగించాలని సూచించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ.. ఆర్థిక స్వాతంత్రం సాధించాలని ఆకాంక్షించారు. మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపు నిచ్చారు. మార్కెట్, పరిశ్రమల అవసరాలు, అభ్యర్థుల డిమాండ్ కు అనుగుణంగా నూతన కోర్సులు ప్రారంభించాలని, ఏడాది అంతా శిక్షణ అందించాలని నిర్వాహకులకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, యూబీఐ డీజీఏం నటరాజ్, ఏజీఎం శ్రీనివాసరావు, ఎల్ డీ ఎం మల్లికార్జున రావు, శిక్షణ కేంద్రం బాధ్యులు, బ్యాంక్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >